Bandi Sanjay Arrested : పాదయాత్ర శిబిరం వద్ద తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బడి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. జనగామలో బండి పాదయాత్ర కొనసాగుతున్న క్రమంలోనే ఆయన ధర్మ దీక్షకు దిగుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.

Bandi Sanjay Arrested
Bandi Sanjay Arrested : బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బడి సంజయ్ ను మంగళవారం (ఆగస్టు 23,2022) పోలీసులు అరెస్ట్ చేశారు. జనగామలో బండి పాదయాత్ర కొనసాగుతున్న క్రమంలోనే ఆయన ధర్మ దీక్షకు దిగుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వచ్చిన క్రమంలో బీజేపీ కార్యకర్తలు ఆమె నివాసం ముందు నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. దీనిని నిరసిస్తూ బండి సంజయ్ జనగామలోని పామ్నూరులో పాదయాత్రలో ఉండగానే పోలీసుల తీరును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్మదీక్షకు పిలుపునిచ్చారు. బండి సంజయ్ కూడా పాదయాత్ర శిబిరం వద్ద నల్ల బ్యాడ్స్ ధరించి దీక్ష చేపట్టే యత్నంచేస్తుండగా పోలీసులు బండి సంజయ్ ను అరెస్ట్ చేయటానికి వచ్చారు. దీంతో బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అయినా పోలీసులు బండి సంజయ్ ను అదుపులోకి తీసుకున్నారు.
కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉందనే ఆరోపణలు వచ్చిన క్రమంలో బీజేపీ కార్యకర్తలు కవిత నివాసం ముందు నిరసనలు చేపట్టగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. దీంతో పాదయాత్రలో కొనసాగుతున్న బండి సంజయ్ పోలీసుల తీరును నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు దీక్ష చేపట్టాలని పిలుపునిచ్చారు. బండి పిలుపును అందుకున్న బీజేపీ కార్యకర్తలు..ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ కార్యకర్తలు అంతా దీక్షకు సిద్ధమయ్యారు. అంతేకాకుండా దాడులకు అవసరమైన కర్రలు..ఇనుప రాడ్లు, రాళ్లు అన్ని సిద్ధం చేసుకున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు ముందస్తుగా భారీ బలగాలతో బండి సంజయ్ పాదయాత్ర శిభిరానికి చేరుకున్నారు. అనంతరం బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు.
బండి సంజయ్ అరెస్ట్ తో ఆ ప్రాంతంలో పోలీసులకు ఆయనకు అదుపులోకి తీసుకుంటుండగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో వారికి పోలీసులకు మద్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకంది. శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని బండి సంజయ్ ను అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో అతి కష్టంమీద బండి సంజయ్ ను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. కాగా మరోపక్క మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బొల్లారం పీఎస్ కు తరలించారు.