తెలంగాణలో ప్రైవేటు ల్యాబ్ లో కరోనా పరీక్షలు..ధరలు ఎంతంటే

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి, టెస్టుల ధరలను వైద్య ఆరోగ్య శాఖ డిసైడ్ చేసింది. కరోనా తీవ్రతను ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నామని, తెలంగాణలో కమ్యూనిటీ స్ప్రెడ్ లేదని వెల్లడించారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం నడుచుకుంటున్నామని తెలిపారు.
2020, జూన్ 15వ తేదీ సోమవారం మంత్రి ఈటెల, సీఎస్ సోమేశ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. వెంటిలెటర్ లేకుండా చికిత్స అందిస్తే రోజుకు రూ. 7 వేల 500, వెంటిలెటర్ తో చికిత్స అందిస్తే…రోజుకు రూ. 9 వేలు, పాజిటివ్ గా గుర్తించి..మాములు ఐసోలేషన్ లో ఉంటే…రూ. 4వేలు వసూలు చేయాలన్నారు.
వారం, పది రోజుల్లో 50 వేల టెస్టులు నిర్వహిస్తామని ప్రకటించారు. జీహెచ్ ఎంసి పరిధిలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయని, 30 నియోజకవర్గాల్లో టెస్టులు నిర్వహిస్తామన్నారు. కరోనా లక్షణాలు ఉంటనే పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఏ లక్షణాలు లేకుండా టెస్టులు చేసుకోవద్దని ప్రజలకు సూచించారు.