Krishna Dist: పాత పగలతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. కృష్ణా జిల్లాలో ఉద్రిక్తత

పాత పగల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటన కృష్ణా జిల్లా, మచిలీపట్నం, గారాల దిబ్బ గ్రామంలో జరిగింది. 20 రోజుల క్రితం గ్రామంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. వైసీపీ, టీడీపీ వర్గీయులు ఒకరిపై ఒకరు కత్తులు, కటార్లతో దాడి చేసుకున్నారు.

Krishna Dist: పాత పగలతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. కృష్ణా జిల్లాలో ఉద్రిక్తత

Krishna Dist

Updated On : July 3, 2022 / 12:52 PM IST

Krishna Dist: పాత పగల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటన కృష్ణా జిల్లా, మచిలీపట్నం, గారాల దిబ్బ గ్రామంలో జరిగింది. 20 రోజుల క్రితం గ్రామంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. వైసీపీ, టీడీపీ వర్గీయులు ఒకరిపై ఒకరు కత్తులు, కటార్లతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో వైసీపీకి చెందిన ఐదుగురు కత్తిపోట్లకు గురయ్యారు.

Modi Meeting: భీమవరంలో మోదీ సభ సజావుగా సాగుతుంది: విష్ణు వర్ధన్ రెడ్డి

ఈ ఐదుగురిని కుటుంబ సభ్యులు బందరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం పోలీసులు వీరిని విజయవాడ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొంది ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు. అయితే, వీరిలో నాగరాజు అనే వ్యక్తి పూర్తిగా కోలుకోలేదు. దీంతో తిరిగి విజయవాడ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ నాగరాజు శనివారం మరణించాడు. నాగరాజు మృతితో గారాల దిబ్బ గ్రామం మళ్లీ అట్టుడికింది. రెండు వర్గాల మధ్య మళ్లీ ఘర్షణలు తలెత్తాయి. ఒకరిపై ఒకరు కర్రలు, కత్తులతో దాడులు చేసుకున్నారు.

Chalasani Srinivas Rao: అల్లూరిని అడ్డుపెట్టుకుని మోదీ రాజకీయం: చలసాని శ్రీనివాస రావు

నాగరాజు చనిపోయినట్లు తెలిసిన వెంటనే గ్రామంలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని గ్రామస్తులు అంటున్నారు. ఘర్షణల నేపథ్యంలో పోలీసులు ఆలస్యంగానైనా రంగంలోకి దిగారు. దాదాపు 30 మంది పోలీసులతో గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు చిలకలపూడి సీఐ శ్రీధర్ కుమార్, రూరల్ సీఐ వీరయ్య గౌడ్, మచిలీ పట్నం ఎస్సై నాగరాజు, పెడన ఎస్ఐ మురళి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.