Thaman Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన థమన్!
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో భాగంగా ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ‘థమన్’ జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటారు.

Thaman Green India Challenge: రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో భాగంగా ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ‘థమన్’ జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా థమన్ మాట్లాడుతూ.. ‘‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రాణదానం చేసిన అనుభూతిని కలిగిస్తోంది’’ అని అన్నారు. ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ద్వారా ఇప్పటివరకు 16 కోట్లకుపైగా మొక్కలు నాటడం చాలా గొప్ప విషయమని ఆయన అన్నారు.
Thaman Mother Singing : 70 ఏళ్ళ వయసులో మసక మసక చీకట్లో పాడుతున్న తమన్ తల్లి సావిత్రి..
ఎక్కడ చూసినా కాంక్రీట్ జంగిల్‌గా కనిపించే మన హైదరాబాద్ నగరంలో పచ్చదనం పెరిగిందని, అభివృద్ధితో పాటు పచ్చదనాన్ని పెంచేందుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఎంతో ఉపయోగపడిందని ఆయన తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భవిష్యత్ కార్యక్రమాలు మరింత విజయవంతం కావాలని థమన్ ఆకాంక్షించారు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌కి ధన్యవాదాలు తెలిపారు.
Green India Challenge : ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో రవితేజ హీరోయిన్.. ఎవరెవర్ని నామినేట్ చేసిందంటే..
ఇక గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని ఆయన అన్నారు. అటుపై థమన్ ముగ్గురు సంగీత దర్శకులు అనూప్, కళ్యాణ్ మాలిక్ మరియు మిక్కీ జే మేయర్‌లకు ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ విసిరారు.