భార్యతో కలిసి తండ్రిని హత్య చేసిన కొడుకు

  • Published By: bheemraj ,Published On : December 3, 2020 / 10:47 AM IST
భార్యతో కలిసి తండ్రిని హత్య చేసిన కొడుకు

Updated On : December 3, 2020 / 10:48 AM IST

son murdered father along with wife : అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మానవత్వం మంటగలిసింది. భార్యతో కలిసి ఓ కొడుకు తండ్రిని దారుణంగా హత్య చేశాడు. కనగానపల్లి మండలం మామిళ్లపల్లిలో ఆ దారుణం జరిగింది. మంచంపై నిద్రిస్తున్న నారాయణ స్వామిని కుమారుడు గణేష్, కోడలు అనిత…ఇద్దరూ కలిసి హత్య చేశారు. వేట కొడవలితో నరికి చంపారు. కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలే హత్యకు కారణంగా తెలుస్తోంది.



రాత్రి 9 గంటల సమయంలో నిద్రిస్తున్న నారాయణస్వామిని కొడుకు, కోడలు వేట కొడవలితో తండ్రిని నరికి చంపారు. చంపిన తర్వాత శవాన్ని బెడ్ షీట్ లో కట్టి బయట పడేయాలని ప్రయత్నిస్తున్న సమయంలో స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుటుంబ కలహాలా, ఆస్తి తగాదాలా అన్న విషయం తేలాల్సివుంది.



నారాయణస్వామికి ఇద్దరు కొడుకులు అల్లారుముద్దుగా పెంచాడు. మూడు నెలల క్రితం గణేష్ కు పెళ్లి చేశాడు. కొడుకు, కోడలు కలిసి కిరాతకంగా చంపిన ఘటన అనంతపురం జిల్లాలో కలకలం రేపింది.