Bike Thief: బైక్ కొట్టేసిన దొంగ మళ్ళీ భద్రంగా అక్కడే తెచ్చిపెట్టాడు!

ఓ బైక్ దొంగ అర్ధరాత్రి ఓ ఇంటి ముందున్న బైకును దొంగతనం చేశాడు. అక్కడే దాన్ని స్టార్ట్ చేస్తే సౌండ్ వచ్చి ఎవరైనా లేస్తారని భావించిన దొంగ దాన్ని అలానే తోసుకుంటూ కాస్త దూరం తీసుకెళ్లాడు. అక్కడ స్టార్ట్ చేయడం మొదలు పెట్టాడు.. కానీ ఎన్నిసార్లు కిక్ కొట్టినా అది స్టార్ట్ కాలేదు.

Bike Thief: బైక్ కొట్టేసిన దొంగ మళ్ళీ భద్రంగా అక్కడే తెచ్చిపెట్టాడు!

Bike Thief

Updated On : June 25, 2021 / 12:11 PM IST

Bike Thief: ఓ బైక్ దొంగ అర్ధరాత్రి ఓ ఇంటి ముందున్న బైకును దొంగతనం చేశాడు. అక్కడే దాన్ని స్టార్ట్ చేస్తే సౌండ్ వచ్చి ఎవరైనా లేస్తారని భావించిన దొంగ దాన్ని అలానే తోసుకుంటూ కాస్త దూరం తీసుకెళ్లాడు. అక్కడ స్టార్ట్ చేయడం మొదలు పెట్టాడు.. కానీ ఎన్నిసార్లు కిక్ కొట్టినా అది స్టార్ట్ కాలేదు. దీంతో అక్కడే వదిలేసి వెళ్తే తనలాంటి ఇంకెవడైనా ఎత్తుకెళ్తాడని అనుకున్నాడో ఏమో కానీ ఎక్కడ నుండి దాన్ని తీసుకెళ్లాడో మళ్ళీ అక్కడే తెచ్చి పెట్టివెళ్ళాడు. ఇదంతా సీసీ కెమెరాలలో రికార్డ్ అయింది.

కర్ణాటకలోని కలబురగి జిల్లాలో ఈ విచిత్రమైన దొంగతనం జరిగింది. దొంగ సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు అఫ్జల్​పురలోని ఆగ్రో రోడ్​లో ఉండే ఓ బైక్​ను దొంగతనం చేశాడు. చుట్టుపక్కల ఎవరైనా లేస్తారని.. బైక్​ను కొంత దూరం నడిపించుకుంటూ వెళ్లి స్టార్ట్ చేసేందుకు యత్నించాడు. కానీ, ఎన్నిసార్లు కిక్ కొట్టినా అది స్టార్ట్ కాలేదు. దీంతో బైకును అక్కడే వదిలేసి వెళ్లలేక దొంగతనం చేసిన ప్రాంతంలోనే తిరిగి భద్రంగా తెచ్చిపెట్టాడు.

ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డవగా వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు వారి వారి బైకు అనుభవాలను గుర్తుచేసుకుంటూ.. దొంగ వెధవ తిక్కబాగా కుదిరింది అంటూ తెగ నవ్వుకుంటున్నారు.