sharmila: ఈ సారి బాగా ఆలోచించి ఓటు వేయాలి: షర్మిల
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల విమర్శించారు.

Ys Sharmila
sharmila: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల విమర్శించారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాఖత్ గూడెం నైట్ క్యాంప్ నుంచి 104వ రోజు పాదయాత్ర ప్రారంభించిన వైఎస్ షర్మిల చిలుకూరు మండలం పోలేనిగూడెం, బేతవోలు, చెన్నారి గూడెం మీదుగా పాదయాత్ర కొనసాగిస్తున్నారు. పోలేని గూడెం గ్రామంలో వైఎస్ షర్మిలకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు.
Maharashtra: శరద్ పవార్‌ను ఓ కేంద్ర మంత్రి బెదిరిస్తున్నారు: సంజయ్ రౌత్
అక్కడ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి షర్మిల నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఎనిమిది ఏళ్లుగా కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉండి ఎవరికి లాభం జరిగిందో ప్రజలు ఆలోచించాలని అన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారని, డబుల్ బెడ్ రూం అన్నారు..ఇచ్చారా..? అని ఆమె నిలదీశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామని చెప్పి మాట తప్పారని అన్నారు. కేసీఅర్ చేతిలో మోసపోని వర్గం లేదని ఆమె విమర్శించారు.
Maharashtra: అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధం: ఏక్‌నాథ్ షిండే
ఈ సారి ఆయన కాలర్ పట్టుకుని ప్రజలు నిలదీయాలని ఆమె అన్నారు. ప్రజల గురించి ఆలోచన చేసే వారే లేరని ఆమె విమర్శించారు. పెన్షన్లు కూడా ఒకటవ తేదీన ఇవ్వడం లేదని చెప్పారు. గ్రామ పంచాయతీ బిల్లులు కూడా ఇవ్వడం లేదని చెప్పారు. తెచ్చిన అప్పులు అన్ని కమీషన్ల రూపంలో కేసీఆర్ తిన్నారని ఆమె ఆరోపించారు. కేసీఅర్ పాలన ఒక దిక్కుమాలిన పాలన అని విమర్శించారు. ఈ సారి ఆలోచించి ఓటు వేయాలని ఆమె కోరారు. వైఎస్సార్ పాలన కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టామని చెప్పారు.