Maharashtra: అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధం: ఏక్‌నాథ్‌ షిండే

మహారాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్ షిండే శివ‌సేన అధిష్ఠానానికి ఎదురు తిర‌గ‌డంతో అక్క‌డి రాజకీయ ప‌రిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి.

Maharashtra: అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధం: ఏక్‌నాథ్‌ షిండే

Eknath Shinde

Maharashtra: మహారాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్ షిండే శివ‌సేన అధిష్ఠానానికి ఎదురు తిర‌గ‌డంతో అక్క‌డి రాజకీయ ప‌రిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఏక్షణమైనా మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది. సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో చర్చలు జరిపే ప్రసక్తి లేదని ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు. షిండే క్యాంప్‌లో రెబ‌ల్ ఎమ్మెల్యేల సంఖ్య‌ 50 చేరువయింది. అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమని షిండే ప్రకటన చేశారు. ఏక్‌నాథ్ షిండే క్యాంపులోకి నేడు మరో ముగ్గురు శివసేన శాసన సభ్యులు చేరుకున్నారు.

Maharashtra: ఇత‌ర రాష్ట్రాల ఎమ్మెల్యేలూ వ‌చ్చి అసోంలో ఉండొచ్చు: సీఎం హిమంత

అసోలోంని గువాహ‌టిలోని ఓ హోట‌ల్‌లో రెబల్ ఎమ్మెల్యేలంద‌రూ ఉంటోన్న విష‌యం తెలిసిందే. శాసనస‌భా పక్ష హోదా కల్పించాలని కోరుతూ డిప్యూటీ స్పీకర్​ నరహరి జిర్వాల్​, గవర్నర్​ భగత్​ సింగ్​ కోశ్యారీ, శాసనమండలి సెక్రెటరీ రాజేంద్ర భగవత్‌కు షిండే లేఖ రాశారు. 37 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన కాపీలను డిప్యూటీ స్పీకర్​, గవర్నర్​లకు పంపారు. శివసేన ఎమ్మెల్యే భరత్​ గోగవాలేను పార్టీ చీఫ్​ విప్​గా సునిల్​ ప్రభు స్థానంలో నియమిస్తున్నట్లు లేఖలో షిండే పేర్కొన్నారు.