Aircraft Crashes In France: ఫ్రాన్స్‌లో కూలిన ఆర్మీ విమానం..ముగ్గురి సైనికుల మృతి

ఫ్రాన్స్ దేశంలో ఆర్మీ విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు సైనికులు మరణించారు.దక్షిణ ఫ్రాన్స్‌లోని కొండ ప్రాంతంలో ఆర్మీ చిన్న విమానం కూలిపోవడంతో ముగ్గురు సైనికులు మరణించారని సైన్యం, ప్రాంతీయ ప్రాసిక్యూటర్ తెలిపారు...

Aircraft Crashes In France: ఫ్రాన్స్‌లో కూలిన ఆర్మీ విమానం..ముగ్గురి సైనికుల మృతి

ఫ్రాన్సులో కూలిన ఆర్మీ విమానం

Updated On : June 18, 2023 / 5:33 AM IST

Aircraft Crashes In France: ఫ్రాన్స్ దేశంలో ఆర్మీ విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు సైనికులు మరణించారు.(Three Soldiers Killed)దక్షిణ ఫ్రాన్స్‌లోని కొండ ప్రాంతంలో ఆర్మీ చిన్న విమానం కూలిపోవడంతో ముగ్గురు సైనికులు మరణించారని సైన్యం, ప్రాంతీయ ప్రాసిక్యూటర్ తెలిపారు.దక్షిణ ఫ్రాన్స్‌లోని వార్ డిపార్ట్‌మెంట్‌లోని గోన్‌ఫరాన్ గ్రామానికి సమీపంలో జరిగిన ఈ విమాన ప్రమాదానికి(Aircraft Crash) కారణాన్ని గుర్తించడానికి దర్యాప్తు ప్రారంభించామని ప్రాంతీయ ప్రాసిక్యూటర్ పాట్రిస్ కాంబెరౌ చెప్పారు.

Earthquake Hits Ladakh: లడఖ్‌లో నిద్రపోతున్న జనాన్ని వణికించిన భూకంపం

విమానం కూలిన ఘటనా స్థలంలో క్రిమినల్‌, ఫోరెన్సిక్‌ అధికారులు పరిశీలించారు.ఫ్రెంచ్ సైన్యం యొక్క దక్షిణ కమాండ్ ప్రకారం, ముగ్గురు మృతుల్లో ఇద్దరు సమీపంలోని 2వ పోరాట హెలికాప్టర్ రెజిమెంట్ శిక్షణా స్థావరం సైనికులని ఫ్రాన్స్ అధికారులు చెప్పారు.ప్రమాదం జరగగానే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన విమాన ప్రమాద స్థలానికి వచ్చి మంటలను ఆర్పారు. విమానం కూలిన ప్రాంతంలో పలు చెట్లు కాలిపోయాయి.