TikTok పనిచేయడం లేదు.. ఈ భారతీయ యాప్స్ ఓసారి ట్రై చేయండి!

  • Published By: sreehari ,Published On : July 1, 2020 / 03:57 PM IST
TikTok పనిచేయడం లేదు.. ఈ భారతీయ యాప్స్ ఓసారి ట్రై చేయండి!

Updated On : July 1, 2020 / 4:53 PM IST

యూజర్ ప్రైవసీ దృష్ట్యా చైనీస్ పాపులర్ షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్‌ను భారత్ నిషేధించింది. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించారు. మిగిలిన 58 చైనీస్ యాప్‌లు మాత్రం ఇంకా డౌన్‌లోడ్ చేసుకునేందుకు అందుబాటులోనే ఉన్నాయి. టిక్‌టాక్ యాప్ ఇకపై దేశంలో డౌన్‌లోడ్ చేసుకోలేరు. ఒకవేళ మీ స్మార్ట్‌ఫోన్‌లో టిక్ టాక్ యాప్ ఉంటే అది ఇప్పటికీ పనిచేస్తుంది. నిషేధాన్ని అమలు చేయడంలో ఎలాంటి ప్రణాళిక అమలు చేస్తున్నారు అనేదానిపై ప్రభుత్వం ఇంకా వివరాలను వెల్లడించలేదు. టిక్‌టాక్‌ను భారత ప్రభుత్వం నిషేధించడం ఇదేం తొలిసారి కాదు. ఈ యాప్ త్వరలో అందుబాటులోకి వచ్చింది కూడా.

ఈ షార్ట్ వీడియో అప్లికేషన్ టిక్ టాక్.. భారతదేశంలో దాదాపు 200 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. వోకల్ ఫర్ లోకల్ చొరవను ప్రధాని మోడీ ప్రకటించినప్పటి నుంచి అనేక భారతీయ స్టార్టప్‌లు టిక్‌టాక్ పోటీగా కొత్త అప్లికేషన్లు డెవలప్ చేయడం ప్రారంభించాయి. ప్రస్తుతం ప్లే స్టోర్, యాప్ స్టోర్లలో చాలా భారతీయ షార్ట్ వీడియో ప్లాట్‌ఫాంలు అందుబాటులో ఉన్నాయి. టిక్ టాక్ యాప్‌కు బదులుగా పోటీగా.. ప్రత్యామ్నాయంగా భారతీయ యాప్స్ చాలానే ఉన్నాయి. అందులో ఒకటి బోలో ఇండియా, అప్పుడు మిట్రాన్ యాప్, రోపోసో కూడా ఉంది. ఇండియన్ టిక్‌టాక్ ప్రత్యామ్నాయ యాప్‌ల జాబితాను మీకోసం అందిస్తున్నాం.. ఈ యాప్స్ ఓసారి డౌన్‌లోడ్ చేసుకుని ప్రయత్నించండి.

Bolo Indya బోలో ఇండియా (Androidలో) :
బోలో ఇండియా యాప్.. ప్రస్తుతం దేశంలో 100,000+ మందికిపైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది కానీ, ఆపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో లేదు. టిక్ టోక్ నిషేధంపై బోలో ఇండియా వ్యవస్థాపకుడు వరుణ్ సక్సేనా ఒక ప్రకటనలో ఏమన్నారంటే.. ‘చైనీస్ యాప్‌ల నిషేధానికి ముందు యూజర్లు రోజుకు 39 నిమిషాలకు పైగా సమయాన్ని వెచ్చించేవారు. ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న బోలో ఇండియా యాప్ కూడా సమాజంలో భాగం కావాలని భారతదేశం నుంచి TikTok స్టార్లను ఆహ్వానిస్తున్నాం’ అని అన్నారు.

లక్షలాది టిక్ టాక్ స్టార్ల జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేసే అవకాశం లభించినందుకు సంతోషిస్తున్నామని తెలిపారు. ఆర్థిక స్వాతంత్ర్యంగా మార్చడానికి వారికి ఈ ప్లాట్ ఫాంను అందిస్తున్నామని చెప్పారు. యుజిసి ప్లాట్‌ఫాంలు, డేటా భద్రత, ప్లాట్ ఫాంపై ఉండే కంటెంట్‌లో భారతీయ నీతి, విలువలు, సంస్కృతి, వారసత్వాన్ని ప్రోత్సహించడంపై భారత ప్రభుత్వ మార్గదర్శకాలకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. తమ ప్లాట్‌ఫామ్‌లో వైరల్ కావడానికి, జనాదరణ పొందటానికి నాణ్యమైన కంటెంట్‌ను పోస్ట్ చేయాలని సక్సేనా చెప్పారు.

మిట్రాన్ (Androidలో) :
టిక్ టాక్ మాదిరిగానే గత కొన్ని నెలలుగా ఈ యాప్‌పై కూడా భారతదేశంలో చాలా వివాదాలు ఉన్నాయి. యాప్ ప్రారంభమైనప్పటి నుంచి ఆ తరువాత ప్లే స్టోర్ నుంచి తొలగించారు. తిరిగి ప్లే స్టోర్‌లో మిట్రాన్ యాప్ చేరింది. మిట్రాన్ ఇప్పుడు దేశంలో బాగా పనిచేస్తోంది. ఇప్పటికే 1 కోట్లకు పైగా యూజర్లు ఈ యాప్ డౌన్‌లోడ్ చేశారు. టిక్‌టాక్ నిషేధంపై వ్యాఖ్యానిస్తూ.. మిట్రాన్ యాప్ సహ వ్యవస్థాపకుడు అనీష్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. ‘భారతీయ యూజర్లు లక్ష్యంగా చేసుకునే ఏదైనా యాప్ స్థానిక కమ్యూనిటీ మార్గదర్శకాలకు సున్నితంగా ఉండాలని అన్నారు. స్థానిక చట్టాలకు లోబడి ఉండాలని సూచించారు. డిజిటల్ ఎంటర్ టైన్మెంట్ అందించాలనే ఉద్దేశంతో మిట్రాన్ యాప్ రూపొందించినట్టు చెప్పారు. గత 2 నెలల్లో 1.2 కోట్ల కంటే ఎక్కువ డౌన్‌లోడ్‌లతో దూసుకెళ్తోంది. మిట్రాన్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది.

రోపోసో (Android, iOSలో) :
భారతీయ యాప్‌లో మరో యాప్ రోపోసో.. భారతీయ షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్.. ఇది చాలా మంది యూజర్లను సంపాదించుకుంది. టిక్‌టాక్ నిషేధంపై ఇన్‌మొబి గ్రూప్ వ్యవస్థాపకుడు, సిఇఒ నవీన్ తివారీ మాట్లాడుతూ.. గూగుల్ ప్లే స్టోర్‌లో నంబర్ వన్ టాప్ వీడియో యాప్‌గా నిలిచిందన్నారు. రోపోసో 65 మిలియన్ల మంది భారతీయ యూజర్లు మనపై ఉంచిన నమ్మకం, ప్రేమను పెంచుతూనే ఉంటారు. రోపోసో గూగుల్ ప్లే స్టోర్‌తో పాటు Appe యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. ప్లే స్టోర్‌లో 50,000,000+ యూజర్లు యాప్‌ను డౌన్‌లోడ్ చేశారు.

G5 టిక్‌టాక్ పోటీగా వస్తోంది:
G5 జూలైలో టిక్‌టాక్ కోసం స్వదేశీ పోటీదారుని ప్రారంభించనున్నట్లు ధృవీకరించింది. ఈ సంస్థ గత కొంతకాలంగా ప్లాట్‌ఫాంపై పనిచేస్తోంది. చివరికి వచ్చే నెలలో విడుదల చేయడానికి రెడీగా ఉంది. ప్లాట్‌ఫామ్ గురించి ప్రస్తుతం మరిన్ని వివరాలు అందుబాటులో లేవు.

చింగారి (Androidలో) :
చింగారి యాప్.. గూగుల్ ప్లే స్టోర్‌లో 1,000,000+ డౌన్‌లోడ్ చేసుకున్నారు. లోకల్ ఫర్ వోకల్ చొరవకు పిఎం మోడీ ప్రకటించినప్పటి నుంచి ఈ యాప్‌కు ఆదరణ పెరిగింది. చింగారి యాప్ సహ వ్యవస్థాపకుడు చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ TikTokSumit Ghosh సుమిత్ ఘోష్ నిషేధంపై వ్యాఖ్యానిస్తూ.. భారత ప్రభుత్వం, భారత ఐటి మంత్రిత్వ శాఖ తీసుకున్న చాలా మంచి చర్యగా పేర్కొన్నారు. చాలా కాలంగా టిక్ టాక్ గూఢాచర్యం చేస్తోందన్నారు. చివరకు ఈ చర్య తీసుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. నరేంద్ర మోడీ సార్ కు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. టిక్‌టాక్ యూజర్లందరని స్వాగతించాలని కోరుకుంటున్నాము. ఇది 100శాతం భారతదేశం పెరిగిన యాప్ ఉద్వేగభరితమైన భారతీయుల కోసం రూపొందించిన చింగారిని ప్రయత్నించండి.

షేర్‌చాట్ (Android, iOSలో) :
మరో ఎంపిక షేర్‌చాట్, బహుభాషా సోషల్ నెట్‌వర్క్. షేర్‌చాట్ భారతీయులచే స్థాపించారు. భారతీయుల సున్నితత్వం, అవసరాలు, ప్రవర్తనను ప్రదర్శించే భారతీయుల కోసమని కంపెనీ తెలిపింది. ఈ యాప్ ప్రస్తుతం 60 మిలియన్లకు పైగా నెలవారీ యాక్టీవ్ యూజర్లను కలిగి ఉంది. గూగుల్ ప్లే స్టోర్‌తో పాటు ఆపిల్ యాప్ స్టోర్ రెండింటిలోనూ లభిస్తుంది. షేర్‌చాట్.. భారతదేశపు అతిపెద్ద ప్రాంతీయ సోషల్ నెట్‌వర్క్‌గా నిలుస్తోంది.. యూజర్లు తమ ఆలోచనలను, అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి వీలు కల్పిస్తుంది.

Read:టిక్‌టాక్‌కు ధీటుగా తెలంగాణ ‘ఛట్‌పట్‌’