Mahesh Kathi: నేడు సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ అంత్యక్రియలు

సినీ నటుడు, విశ్లేషకుడు కత్తి మహేశ్‌ (44) నెల్లూరు జిల్లాలో జూన్‌ 26న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతిచెందిన సంగతి తెలిసిందే. కాగా కత్తి మహేష్‌ అంత్యక్రియలు నేడు ఆయన స్వగ్రామంలో జరగనున్నాయి.

Mahesh Kathi: నేడు సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ అంత్యక్రియలు

Today Is The Funeral Of Film Critic Kathi Mahesh

Updated On : July 11, 2021 / 7:42 AM IST

Mahesh Kathi: సినీ నటుడు, విశ్లేషకుడు కత్తి మహేశ్‌ (44) నెల్లూరు జిల్లాలో జూన్‌ 26న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతిచెందిన సంగతి తెలిసిందే. కాగా కత్తి మహేష్‌ అంత్యక్రియలు నేడు ఆయన స్వగ్రామంలో జరగనున్నాయి. తన స్వగ్రామం చిత్తూరు జిల్లా యర్రావారిపాలెం మండలం యలమందలో నేడు కత్తి మహేశ్ అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తిచేశారు.

ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తల, శరీరంపై తీవ్ర గాయాలు అవడంతో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆయన కోలుకుంటున్నారని, వైద్యులు కూడా చెప్పారు. అయితే, శనివారం కత్తి మహేశ్‌ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. దీంతో ఆయన అభిమానులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు.

ఆయనకు భార్య సోనాలితో పాటు ఓ కుమారుడు కూడా ఉండగా ఆయన మరణం పట్ల తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కత్తి మహేశ్‌ దర్శకుడు, నటుడు మాత్రమే కాకుండా సినీ విశ్లేషకుడిగా కూడా పలు టెలివిజన్‌ ఛానళ్లు, యూట్యూబ్‌ వేదికగా సినిమాలను విశ్లేషించేవారు.