Gyanvapi Mosque: మసీదులో శివలింగానికి పూజలు.. నేడు తీర్పు వెలువరించనున్న కోర్టు

జ్ఞానవాపీ మసీదు ప్రాంగణంలో గుర్తించిన శివలింగానికి పూజలు చేయడానికి అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై వారణాసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది.

Gyanvapi Mosque: మసీదులో శివలింగానికి పూజలు.. నేడు తీర్పు వెలువరించనున్న కోర్టు

Gyanvapi Mosque

Updated On : November 8, 2022 / 11:21 AM IST

Gyanvapi Mosque: జ్ఞానవాపీ మసీదు ప్రాంగణంలో గుర్తించిన శివలింగానికి పూజలు చేయడానికి అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై వారణాసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. స్వయంభూ జ్యోతిర్లింగ భగవాన్ విశ్వేశ్వరుని ప్రార్థన వెంటనే ప్రారంభించేందుకు అనుమతి, మొత్తం జ్ఞానవాపి సముదాయాన్ని హిందువులకు అప్పగించడం, నిషేధించడం అదేవిధంగా జ్ఞానవాపి కాంప్లెక్స్ ప్రాంగణంలోకి ముస్లింల ప్రవేశం వంటి మూడు ప్రధాన డిమాండ్లపై సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తన తీర్పును వెలువరించనుంది.

Gyanvapi Mosque issue: జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి కోర్టు కీలక తీర్పు

ఈ ఏడాది అక్టోబరు నెలలో జరిగిన విచారణలో వారణాసి కోర్టు శివలింగంపై శాస్త్రీయ దర్యాప్తుని అనుమతించడానికి నిరాకరించింది. జ్ఞానవాపీ మసీదు వజుఖానాలో వీడియో సర్వే సమయంలో బయటపడిన శివలింగానికి కార్బన్ డేటింగ్ నిర్వహించేలా ఆదేశాలు వెలువరించాలని హిందూ పక్షాలు సెప్టెంబరు 22న కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. అయితే, ఇది శివలింగం కాదని, ఫౌంటెయిన్ అని ముస్లింలు వాదిస్తున్నారు.

Gyanvapi mosque : జ్ఞానవాపి కేసులో కోర్టుతీర్పుతో ముస్లిం మహిళలు సంబరాలు .. శివలింగానికి హారతి ఇచ్చి పూజలు

సెప్టెంబర్ 29న విచారణలో హిందూ పక్షం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాచే శివలింగం, దాని చుట్టుపక్కల ప్రాంతం యొక్క కార్బన్ డేటింగ్ పై శాస్త్రీయ పరిశోధన చేయాలని డిమాండ్ చేసింది. అయితే వారణాసి కోర్టు మాత్రం వాటిని తోసిపుచ్చింది. భారత పురావస్తు శాఖ సర్వేకు ఆదేశించడం సరైంది కాదని, ఇటువంటి ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా శివలింగం వయస్సు, స్వభావం, నిర్మాణం గురించి తెలుసుకోవటం సాధ్యమయ్యే అవకాశం లేదని, న్యాయమైన పరిష్కారం కనుక్కోవాల్సి ఉందని కోర్టు అభిప్రాయ పడింది. కాగా ఈ రోజు మూడు అంశాలపై కోర్టు ఏ విధిమైన తీర్పు ఇస్తుందోనని అందరిలో ఆసక్తి నెలకొంది.