Headlines : కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ చాలా సాహసోపేత నిర్ణయమే తీసుకున్నారు. ప్రార్థనా స్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను బ్యాన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Headlines : కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త

Today Headlines in Telugu at 11PM

Updated On : December 13, 2023 / 10:56 PM IST

సీఎం జగన్ తీపికబురు..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెగ్యులరైజేషన్ గైడ్ లైన్స్ ఎట్టకేలకు వచ్చేశాయి. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ గైడ్ లైన్స్ ను ఆర్ధిక శాఖ జారీ చేసింది. ఎల్లుండి (డిసెంబర్ 15) నుంచి రెగ్యులరైజేషన్ కోసం ఉద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది. సంక్రాంతిలోగా ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. 2014 జూన్ 2 నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్న వారందరినీ రెగ్యులరైజేషన్ చేస్తున్నట్లు ఇటీవలే మంత్రి బుగ్గన ప్రకటించిన సంగతి తెలిసిందే.

పార్లమెంట్ ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అప్రమత్తం
రాజధాని ఢిల్లీలో ఉన్న పార్లమెంట్ ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అప్రమత్తం చేశారు. హర్యానా అసెంబ్లీ సమావేశాలకు భద్రతను కట్టుదిట్టం చేస్తూ బుధవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. విజిటర్ పాసులను ఒక గంట మాత్రమే చెల్లుబాటయ్యేలా జారీ చేయాలని నిర్ణయించారు. హర్యానా, చండీగఢ్, పంజాబ్ పోలీసులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ప్రాంగణం చుట్టూ ఎలాంటి ప్రదర్శనలకు అనుమతి లేదని ఆదేశాలు ఇచ్చారు. ఎమ్మెల్యేల వ్యక్తిగత సిబ్బందిని సైతం అసెంబ్లీలోకి అనుమతించకూడదని నిర్ణయించారు.

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే సంచలన నిర్ణయం
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ చాలా సాహసోపేత నిర్ణయమే తీసుకున్నారు. ప్రార్థనా స్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను బ్యాన్ చేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ఈరోజే ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, కొద్ది గంటల్లోనే ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం.

ఎంపీలకు భద్రత కరువైంది
లోక్‌స‌భ‌ విజిటర్ గ్యాలరీలో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు అలజడి రేపిన విషయంపై తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. పార్లమెంట్లో జరిగిన ఘటన బాధాకరమని అన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఎంపీలకే భద్రత కరవైందని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నాలుగున్నర లక్షల కోట్లు అప్పులు
బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నాలుగున్న లక్షల కోట్ల అప్పులు తెచ్చారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.

కోడికత్తి కేసు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు
కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ప్రొసీజర్ ఫాలో కాలేదంటూ శ్రీనివాస్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మెమో రూపంలో అన్ని అంశాలను కోర్టు ఎదుట ఉంచాలని పిటిషనర్ తరపు న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.

ట్రైన్‌లో యువతితో స్టెప్పులేసిన పోలీస్
ముంబయిలో ఓ పోలీసు అధికారి చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కదులుతున్న ట్రైన్‌‌లో ఓ యువతితో హోంగార్డు SF గుప్తా స్టెప్పులేసిన వీడియో బయటకు రావడంతో అధికారులు సీరియస్ అయ్యారు.

పార్లమెంట్‌లా మారిపోనున్న తెలంగాణ అసెంబ్లీ..
త్వరలో తెలంగాణ అసెంబ్లీ రూపురేఖలు మారిపోనున్నాయి. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ కార్యదర్శికి కీలక ఆదేశాలు జారీ చేశారు.వచ్చే అసెంబ్లీ సెషన్ వరకు పూర్తిగా మారిపోవాలని ఆదేశించారు. దీంతో త్వరలో పార్లమెంటులా అసెంబ్లీ పూర్తిగా మారిపోనుంది. అసెంబ్లీ,మండలి కలిపి ఒకే బిట్ లా కనిపించేలా మార్పులు చేయనున్నట్లుగా తెలుస్తోంది.పార్లమెంటును దృష్టిలో పెట్టుకుని పనులు చేయాలని..పార్లమెంటు వద్ద విజయ్ చౌక్‌లా మార్పులు చేయాలని రేవంత్ ఆదేశించారు.

అధికారిక నివాసం..
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అధికారిక నివాసంగా ప్రజాభవన్ ను కేటాయించారు. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

దర్యాప్తు షురు..
లోక్ సభలో టియర్ గ్యాస్ కలకలంపై స్పీకర్ స్పందించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు. భద్రతా అంశాలపై అన్ని పార్టీల నేతలతో చర్చిస్తామని తెలిపారు. యథావిధిగా సభా కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు. ఢిల్లీ పోలీసులు, యాంటీ టెర్రర్ యూనిట్ స్పెషల్ సెల్ దీనిపై దర్యాప్తు చేస్తోంది. ఈ ఘటనకు పాల్పడిన అగంతకులను భద్రతా సిబ్బంది ప్రశ్నిస్తున్నారు.

భద్రతా వైఫల్యం
పార్లమెంట్‌లో అతిపెద్ద భద్రతా వైఫల్యం బయటపడింది.లోక్‌సభ విజిటర్స్‌ గ్యాలరీ నుంచి దూకిన ఆగంతకులు సభలో టియర్ గ్యాస్ ఉపయోగించారు. లోక్‌స‌భ‌ విజిటర్ గ్యాలరీలో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లుండి సభలోకి వచ్చారు. అందులో ఒకరు స్పీకర్ పోడియంవైపు దూసుకెళ్లారు. దీంతో ఒక్కసారిగా సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. హఠాత్తుగా జరిగిన ఘటనతో ఎంపీలు ఉలిక్కిపడ్డారు. భయంతో బయటకు పరుగులు పెట్టారు. అప్రమత్తమైన భద్రత సిబ్బంది వెంటనే ఆ ఇద్దరు అంగతకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు.

నామినేషన్ టైమ్..
తెలంగాణ స్పీకర్ అభ్యర్థిగా గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ వేశారు. అసెంబ్లీ సెక్రటరీ ననరసింహాచార్యులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరయ్యారు. మాజీ మంత్రి కేటీఆర్ కూడా హాజరయ్యారు. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు  BRS మద్దతు తెలిపింది.

ధరణిపై సీఎం దృష్టి
ధరణి పోర్టల్ పై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. ఈరోజు మధ్యాహ్నాం ధరణిపై  సమీక్ష నిర్వహించనున్నారు. ధరణిపై తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార కాంగ్రస్ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో కీలకమైనదిగా ఉంది. ధరణి పేరుతో భూ అక్రమాలు జరిగాయనే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఎన్నికల్లో గెలిచి సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ఈరోజు ధరణి పోర్టల్‎పై సమీక్ష నిర్వహించనున్నారు.

కొత్త బాస్
హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. రోడ్ నెంబర్ 12 లోని కమాండ్ కంట్రోల్ సెంటల్ లో బాధ్యతలు స్వీకరించారు. శ్రీనివాస్ రెడ్డి గతంలో గ్రేహౌండ్స్, అక్టోపస్ లో పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..డ్రగ్స్ రహిత నగరంలో హైదరాబాద్ ను నిలబెడతామని తెలిపారు. శ్రీనివాస్ రెడ్డికి ముక్కుసూటి అధికారి అనే పేరుంది. ఈ సందర్భంగా ఆయన డ్రగ్స్ ముఠాలకు  సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వెంటనే హైదరాబాద్, తెలంగాణను వదిలి డ్రగ్స్ ముఠాలు వెళ్లిపోవాలన్నారు. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అవగాహన..
సినీ పరిశ్రమలోనే డ్రగ్స్‌ వినియోగం ఎక్కువ అని హైదరాబాద్ కొత్త సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి అన్నాు. డ్రగ్స్‌ ఫ్రీ సిటీ కోసం అవగాహన పెంచుతామమని అన్నారు.

విచారణ వాయిదా
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు సీబీఐకి అప్పగించాలని ఉండవల్లి వేసిన పిటిషన్‌పై విచారణ వాయిదాపడింది.

మా సంగతేంటి?
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఆటో డ్రైవర్ల ఆందోళన చేపట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై నిరసన తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల తమ ఉపాధి కోల్పోతున్నామంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

పట్టాభిషేకం
మధ్యప్రదేశ్‌ సీఎంగా మోహన్‌ యాదవ్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ హాజరయ్యారు.

యాసిడ్‌ అటాక్‌
బిహార్‌లో ఓ యువతి యువకుడిపై యాసిడ్‌ చల్లింది.పెళ్లి చేసుకోవాలంటూ వేధిస్తుండటంతో యాసిడ్ తో దాడి చేసింది.

పోటెత్తిన భక్తులు..
భక్తులతో శబరిమల.. కిటకిటలాడుతోంది. మాల ధారణతో వచ్చే భక్తులతో శబరిగిరులు కిటకిటలాడుతున్నాయి. అయ్యప్ప మాల ధరించిన భక్తులు స్వామివారి దర్శనం కోసం పోటెత్తారు. స్వామియే శరణం అయ్యప్పా అంటూ శబరిగిరులు మారు మోగుతున్నాయి. భక్తులకు సరైన ఏర్పాట్లు చేయలేదని విమర్శలు వస్తున్నాయి.

ల్యాండ్‌ ఫైట్
వేల్పూర్‌లో ఇరువర్గాల మధ్య స్థల వివాదం రాజుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనటంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు.

పార్టీ మార్పు..
ఈరోజు చంద్రబాబు సమక్షంలో కుప్పం వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరనున్నారు. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో మధ్యాహ్నాం 3గంటలకు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు.

కేంద్ర బృందం పర్యటన..
తుపాను కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో రైతుల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో పంట నష్టం అంచనాకు నేడు కృష్ణా, బాపట్ల జిల్లాలో, రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. తుపానుతో జరిగిన నష్టాన్ని బృదం అంచనా వేయనుంది.

హైదరాబాద్ బెస్ట్ సిటీ..
విశ్వనగరంగా దూసుకెళ్తున్న హైదరాబాద్‌ నగరానికి మరో అరుదైన గుర్తింపు దక్కింది. దేశంలో మెరుగైన జీవన ప్రమాణాలు కలిగిన నగరాల జాబితాలో హైదరాబాద్‌ నిలిచింది. ఈ మేరకు మెర్సర్స్‌ క్వాలిటీ ఆఫ్‌ లివింగ్‌ ర్యాంకింగ్స్‌ 2023లో వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో పుణె, బెంగళూరు, చెన్నై నగరాలు నిలిచాయి. 2015 నుంచి భారత్ లో అత్యుత్తమ నగరంగా నిలవడం హైదరాబాద్ కు ఇది ఆరోసారి అని మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ సందర్భంగా హైదరాబాదీలకు ఆయన అభినందనలు తెలిపారు.

14న బాధ్యతలు స్వీకరణ ..
రెవెన్యూ శాఖ బాధ్యతలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 14వ తేదీ గురువారం స్వీకరించనున్నారు. తెలంగాణ సచివాలయంలో మొదటి అంతస్థును రెవెన్యూ శాఖకు కేటాయించారు.

దేశంలో జోరుగా గోల్డ్‌ స్మగ్లింగ్‌ ..
దేశంలో భారీగా గోల్డ్‌ స్మగ్లింగ్‌ నడుస్తోంది. గత జనవరి నుంచి అక్టోబర్ వరకు రికార్డు స్థాయిలో 3వేల 917 కిలోల స్మగ్లింగ్ గోల్డ్‌ పట్టుబడింది. ఈ మేరకు ఈ గోల్డ్‌ను జప్తు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ వరకు బంగారం స్మగ్లింగ్‌పై దేశవ్యాప్తంగా 4వేల 798 కేసులు నమోదు చేశామని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభ ప్రశ్నోత్తరాల్లో వెల్లడించారు.

ఉగ్ర ఘాతుకం ..
పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆత్మాహుతి దాడిలో 23 మంది సైనికులు మృతిచెందారు.

భారత్‌ ఓటమి..
రెండో టీ20లో భారత్‌ ఓడిపోయింది. సఫారీలు విక్టరీ కొట్టారు. తొలి టీ20 వర్షార్పణం అవ్వగా.. మంగళవారం జరిగిన టీ20లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం సౌతాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ ఇండియా 19.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. వర్షం ఆగిపోవడంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ను 15 ఓవర్లకు కుదించి లక్ష్యాన్ని 152గా నిర్దేశించారు. ఈ టార్గెట్‌ని సఫారీలు 5 వికెట్లు కోల్పోయి 7 బంతులు మిగిలి ఉండగానే ఛేదించారు.
అధ్యక్షా…!
తెలంగాణ స్పీకర్‌గా ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. సభాపతి ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
రైతుకు భరోసా ..
ఇటీవల తుపాను కారణంగా పలు ప్రాంతాల్లో రైతులు పండించిన ధాన్యం తడిసి రంగుమారింది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కొంటామని ఏపీ సీఎం జగన్ రైతులకు భరోసా ఇచ్చారు.