Today Headlines : నాగార్జున సాగర్‌కు కేంద్ర బలగాలు.. టీ20 సిరీస్ మనదే

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైంది. కాంగ్రెస్ కు 63 నుంచి 73 సీట్లు వస్తాయని అంచనా వేసింది. బీఆర్ఎస్ కు 34 నుంచి 44 సీట్లు.. బీజేపీకి 4 నుంచి 8 సీట్లు, ఇతరులకు 5 నుంచి 8 సీట్లు వస్తాయని అంచనా కట్టింది.

Today Headlines : నాగార్జున సాగర్‌కు కేంద్ర బలగాలు.. టీ20 సిరీస్ మనదే

వాటర్ హీట్
కేంద్ర హోంశాఖ ఆదేశాలతో కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. నాగార్జున సాగర్ డ్యామ్ వద్దకు భారీగా సీఆర్పీఎఫ్ బలగాలు చేరుకున్నాయి. తెలుగు రాష్ట్రాల నడుమ జల వివాదం నేపధ్యంలో నాగార్జున సాగర్ డ్యామ్ ను తమ ఆధీనంలోకి తీసుకోనున్నాయి సీఆర్పీఎఫ్ బలగాలు. డ్యామ్ భద్రత కేంద్ర రిజర్వ్ పోలీస్ దళాల పర్యవేక్షణలో తాత్కాలికంగా ఉంచుతామని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా తెలిపారు.

టీ20 సిరీస్ భారత్ కైవసం
మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే భార‌త జ‌ట్టు టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. రాయ్‌పుర్‌ లోని షాహీద్‌ వీర్‌ నారాయణ్‌ సింగ్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జ‌రిగిన నాలుగో టీ20 మ్యాచులో 20 ప‌రుగుల తేడాతో భార‌త్ విజ‌యం సాధించింది. దీంతో 5 మ్యాచుల టీ20 సిరీస్‌లో భార‌త్ 3-1తో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. నామ మాత్ర‌మైన చివ‌రి టీ20 మ్యాచ్ ఆదివారం చిన్న‌స్వామి స్టేడియంలో జ‌ర‌గ‌నుంది.

వాటర్ హీట్
కేంద్ర హోంశాఖ ఆదేశాలతో కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. నాగార్జున సాగర్ డ్యామ్ వద్దకు భారీగా సీఆర్పీఎఫ్ బలగాలు చేరుకున్నాయి. తెలుగు రాష్ట్రాల నడుమ జల వివాదం నేపధ్యంలో నాగార్జున సాగర్ డ్యామ్ ను తమ ఆధీనంలోకి తీసుకోనున్నాయి సీఆర్పీఎఫ్ బలగాలు. డ్యామ్ భద్రత కేంద్ర రిజర్వ్ పోలీస్ దళాల పర్యవేక్షణలో తాత్కాలికంగా ఉంచుతామని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా తెలిపారు.

డిసెంబర్ 3 కాదు 4..
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మిజోరం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీలో మార్పు చేసింది. డిసెంబర్ 3కు బదులుగా 4న కౌంటింగ్ జరపాలని ఈసీ నిర్ణయించింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఈసీ ఈ డెసిషన్ తీసుకుంది. కాగా, మిగిలిన రాష్ట్రాల్లో(తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్) మాత్రం డిసెంబర్ 3నే ఓట్ల లెక్కింపు జరగనుంది.

తెలంగాణ కింగ్ కాంగ్రెస్‌..!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైంది. కాంగ్రెస్ కు 63 నుంచి 73 సీట్లు వస్తాయని అంచనా వేసింది. బీఆర్ఎస్ కు 34 నుంచి 44 సీట్లు.. బీజేపీకి 4 నుంచి 8 సీట్లు, ఇతరులకు 5 నుంచి 8 సీట్లు వస్తాయని అంచనా కట్టింది. కాగా, మిగతా సర్వే సంస్థలు కూడా దాదాపు హస్తం పార్టీకి అనుకూల అంచనా ఫలితాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.


ఏపీ, తెలంగాణ జల జగడంపై లోకేశ్ అనుమానం

కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ లో బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడారు. సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. చంద్రబాబు ని చూసినా, పవన్ ని చూసినా జగన్ కు భయమేస్తోందన్నారు. చివరికి చెల్లిని చూసినా, ప్రజలను చూసినా జగన్ కి భయం కలుగుతోందన్నారు. అందుకే పరదాలు కట్టుకుని వస్తారని విమర్శించారు లోకేవ్. కనీసం ఒక్క ఆరోపణను కూడా ఈ ప్రభుత్వం నిరూపించలేకపోయిందన్నారు. నాగార్జున సాగర్ డ్యామ్ వివాదంపై స్పందించిన లోకేశ్.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మన పోలీసులను తెలంగాణకు పంపి గొడవలు పెడతారు, తెలంగాణ పోలీసులతో మన పోలీసులపై కేసులు పెట్టించారు, కోడికత్తి లాగానే ఇదీ జగన్ ఆడుతున్న కొత్త డ్రామా అని అనుమానం వ్యక్తం చేశారు లోకేశ్.

కృష్ణా జలాల వివాదం కేసులో విచారణ వాయిదా
సుప్రీంకోర్టులో కృష్ణా జలాల వివాదం కేసు విచారణ జనవరి 12కు వాయిదా పడింది. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాలను తిరిగి పంపిణీ చేయాలని అక్టోబర్ 6న గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని గతంలోనే కేంద్రానికి, తెలంగాణకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలుకు మరింత సమయం కావాలని కేంద్ర జల శక్తి శాఖ కోరడంతో విచారణ వాయిదా పడింది.


చంద్రబాబుకి బెయిల్ ఇవ్వొద్దని వాదనలు

ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబుకి బెయిల్ ఇవ్వొద్దంటూ వాదనలు వినిపించారు ఏజీ. వాదనలు విన్న కోర్టు.. తదుపరి విచారణను డిసెంబర్ 6కు వాయిదా వేసింది. అటు ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో పీటీ వారెంట్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను ఈ నెల 5కు వాయిదా వేసిన ఏసీబీ కోర్టు.

 

జనసేన సిద్ధంగా ఉండాలి : పవన్ కల్యాణ్
మంగళగిరిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. భవిష్యత్ కార్యాచరణపై క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతు..ఏపీలో ఎన్నికలకు ఇంకా మూడు నెలలే సమయం ఉందని..పార్టీ శ్రేణులు అంతా కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. జసేన, టీడీపీ సమన్వయంతో కార్యాచరణ రూపొందిస్తున్నామని..ఇది ఏపీ భవిష్యత్తును అభివృద్ధి వైపు తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుందన్నారు.

జల జగడం
నాగార్జున సాగర్ ప్రాజెక్టు రైట్(కుడి) కెనాల్ కి తక్షణమే నీటి విడుదలను ఆపేయాలని కృష్ణ రివర్ బోర్డు మేనేజ్ మెంట్(కేఆర్ఎంబీ) ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇరువర్గాల మధ్య వివాదాన్ని తెరదించాలని కోరింది. సాగునీరు కావాలని ఏపీ తమను కోరలేదంది. నాగార్జున సాగర్ నుండి ఏపీకి 15 టీఎంసీల నీటి విడుదలకు ఒప్పందం జరిగింది. నవంబర్ 30 వరకు అడగకుండా ఎలా నీటిని విడుదల చేస్తారని కేఆర్ఎం బీ ప్రశ్నించింది.

ఫ్యాక్టరీలో ఫైర్‌
పశ్చిమ బెంగాల్లోని ఓ ప్లాస్టిక్‌ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన తరలి వచ్చింది. మంటలను అదుపుచేసింది.

కప్పేసిన మంచు
జమ్ముకశ్మీర్‌లో భారీగా మంచు కురుస్తోంది. దీంతో కుప్వారా-తంగ్‌ధర్‌ రహదారి మూసివేశారు.

డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు.. 4న తెలంగాణ క్యాబినెట్ సమావేశం..
సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరుగనుంది. డిసెంబర్ 4న మధ్యాహ్నాం 2గంటలకు క్యాబినెట్ సమావేశం జరుగనుంది. డిసెంబర్ 3 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లెక్కింపు..దాదాపుగా సాయంత్రం లేదా రాత్రి సమయానికి ఫలితాలు వెలువడనున్నాయి. 3న ఫలితాలు వెలువడనున్న క్రమంలో 4వ తేదీన తెలంగాణ క్యాబినెట్ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఫలితాలు బీఆర్ఎస్ కు అనుకూలంగా వచ్చినా..వ్యతిరేకంగా వచ్చినా క్యాబినెట్ సమావేశానికి సంబంధించి ఓ తీర్మానం కాపీని రెడీ చేసి గవర్నర్ కు అందజేయనున్నారు. ఎలక్షన్స్‌ రిజల్ట్‌ తర్వాత  క్యాబినెట్ సమావేశం నిర్వహించడంపై ఉత్కంఠ నెలకొంది.

విజయంపై ధీమా
డిసెంబర్‌ 3న తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే అని గులాబీ బాస్ కేసీఆర్ నేతలకు పిలుపునిచ్చారు. గెలుపుతో సంబరాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

టీడీపీ వ్యూహం
కాసేపట్లో టీడీపీ ఎంపీలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. నేతలకు దిశానిర్ధేశం చేయనున్నారు.

ప్రపంచ ఎయిడ్స్‌ డే..
ప్రపంచ ఎయిడ్స్‌ డే సందర్బంగా అవగాహన ర్యాలీలు, ప్రదర్శనలు జరుగుతున్నాయి. డిసెంబర్ 1 అంతర్జాతీయ ఎయిడ్స్ డే సందర్భంగా ఈ వ్యాధిపై అవగాహన కార్యక్రమాలతో పాటు పలు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. వ్యాధి నివారణ చర్యలపై దేశవ్యాప్తంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. ప్రపంచ ఎయిడ్స్‌ డే సందర్బంగా అవగాహన ర్యాలీలు, ప్రదర్శనలు జరుగుతున్నాయి. డిసెంబర్ 1 అంతర్జాతీయ ఎయిడ్స్ డే సందర్భంగా ఈ వ్యాధిపై అవగాహన కార్యక్రమాలతో పాటు పలు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. వ్యాధి నివారణ చర్యలపై దేశవ్యాప్తంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి.

ఓటెత్తిన తెలంగాణ
తెలంగాణలో 70.74శాతం పోలింగ్ నమోదు అయ్యిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. తెలంగాణలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 90.03 శాతం పోలింగ్ నమోదు అయ్యిందని అలాగే హైదరాబాద్ లో అత్యంత తక్కువగా 46.68 శాతంగా పోలింగ్ నమోదు అయ్యిందని తెలిపారు.

కౌంటింగ్‌.. కౌంట్‌ డౌన్‌..
తెలంగాణ అసెంబ్లీ పోలింగ్ ముగిసింది. ఇక ఫలితాల కోసం నేతలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎల్లుండి ఓట్ల లెక్కింపుకోసం ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. దీంట్లో భాగంగా 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపడుతామన్న ఈసీ వెల్లడించింది.

వాటా.. మాట..
AP హక్కుల్లో తలదూర్చేందుకు తెలంగాణ ప్రయత్నాలు చేస్తోంది అంటూ ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తమ వాటా ప్రకారమే నీటిని విడుదల చేశామని..తమ నీటి హక్కుల కోసం చేసే యత్నం దండయాత్ర ఎలా అవుతుంది..? అని ప్రశ్నించారు. కాగా.. నాగార్జునసాగర్ నీటి విడుదల వివాదం అంతకంతకు ముదురుతోంది. తెలంగాణ అధికారులు ఏపీ పోలీసులపై సాగర్‌ పీఎస్‌లో కేసు నమోదు చేశారు.

కాయ్ రాజా కాయ్..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ షురు అయ్యాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న దానిపై జోరుగా పందేలు కొనసాగుతున్నాయి. యాప్ ల ద్వారా రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఈ బెట్టింగ్ లు జరుగుతున్నాయి.

సంపూర్ణ మెజార్టీ కాంగ్రెస్ దే..
1970 ఎమర్జెన్సీ లో జరిగిన ఎన్నికలకు నిన్న జరిగిన ఎన్నికలకు సారుప్యత ఉంది. ప్రజలు ఈ ఎన్నికల్లో పాలకులపై పూర్తిగా వ్యతిరేకత కనబర్చారు. తెలంగాణ ఉద్యమ పౌరుషం ఎక్కడ తగ్గలేదు. ఈ ఎన్నికల్లో స్పష్టంగా ప్రజల్లో కనిపించిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. ఇలాంటి ఎన్నికలను చూడటం అదృష్టం, సంపూర్ణ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని కోదండరాం జోస్యం చెప్పారు.

శుభవార్త వింటాం..
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. కాంగ్రెస్ కే ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నాయి. తాజాగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలాకాలం తరువాత రాత్రి కంటినిండా నిద్రపోయానని అన్నారు. అసలైన ఫలితాలు తమకు శుభవార్త చెబుతాయని కేటీఆర్ అన్నారు.

పుంగనూరులో టెన్షన్.. టెన్షన్..
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఎలక్ట్రిక్ బస్సుల పరిశ్రమకు తమ భూములు ఇచ్చేది లేదంటు గోపిశెల్లిపల్లె రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు గోపిశెల్లిపల్లెలో భారీగా మోహరించారు. మొత్తం గ్రామాన్ని పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. కాగా ఈరోజు పెప్పర్ ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ప్రతినిధులు పుంగనూరుకు రానున్నారు. దీంతో రైతులు  సంస్థ ప్రతినిధులు తమ గ్రామానికి రావద్దంటూ బస్సుల తయారీ సంస్థకు తమ భూములు ఇవ్వం అంటూ ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవటంతో ఉద్రిక్తత ఏర్పడింది.

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై కాయ్ రాజా కాయ్..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ లు జోరుగా జరుగుతున్నాయి. తెలంగాణలో ఏపార్టీ అధికారంలోకి వస్తుంది..? ప్రధాన అభ్యర్ధులు ఎవరు గెలుస్తారు..? అనే దానిపై బెట్టింగులు జోరుగా నడుస్తున్నాయి. తెలంగాణలో హంగ్ వస్తుందంటూ పలువురు పందాలు కాసారు. మరీ ముఖ్యంగా కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గెలుస్తారని కొంతమంది..కాదు కేసీఆర్ గెలుస్తారని మరికొంతమంది బెట్టింగ్ లు కాశారు. అలాగే సిద్ధిపేటలో హరీశ్ రావు మెజారిటీ ఈ సారి తగ్గుతుందని..అలాగే రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్,బండి సంజయ్, కోమటిరెడ్డి బ్రదర్స్,ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లారెడ్డి సహా పలువురు నేతలు పోటీ చేస్తున్న స్థానాలపై జోరుగా బెట్టింగులు ఊపందుకున్నాయి.

ప్రమాదం వెనుక..?
విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అగ్ని ప్రమాదంపై విచారణ జరుగుతోంది. దర్యాప్తులో భాగంగా క్లూస్ టీమ్ ఘటనాస్థలంలో ఆధారాలు సేకరిస్తోంది.

యాత్ర జోష్‌..
టీడీపీ నేతలు నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించింది.

గడువు ముగిసింది..
వైఎస్ వివేకనందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినావ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి జైల్లో లొంగిపోయారు. భాస్కర్ రెడ్డి కండిషన్ బెయిట్ గడుపు ముగియటంతో ఆయన జైల్లో లొంగిపోయారు. ఆయన ఆరోగ్య సమస్యల రీత్యా సీబీఐ కోర్టు నిన్నటి వరకు కండిషన్ బెయిల్ ఇచ్చింది. బెయిల్ గడువు ముగియటంతో ఆయన తాజాగా జైల్లో లొంగిపోయారు.

అమ్మో.. కాలుష్యం
ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుకుంది. వాయు వేగం తగ్గడంతో సివియర్ కేటగిరీలో గాలి నాణ్యత తగ్గిపోయింది. ఢిల్లీ పరిసరప్రాంతాల్లో వరి చేలు దగ్ధం చేయటంతో ఈ కాలుష్యం తీవ్రత కొనసాగుతోంది.

ఎగ్జిట్ పల్స్‌..
తెలంగాణలో కర్ణాటక క్యాంప్‌ పాలిటిక్స్ కు తెలంగాణ కాంగ్రెస్ తెరతీసింది. గెలుపు ధీమాతో ఉన్న హస్తం పార్టీ గెలిచిన తన అభ్యర్ధుల్ని కాపాడుకునే ప్లాన్ లో ఉంది. ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్‌ ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్..గెలిచిన తమ అభ్యర్థుల్ని క్యాంపులకు తరలించే యోచనలో ఉంది.

త్వరలో కార్యాచరణ
టీడీపీ అధినేత నారా చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య భువనేశ్వరితో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.

మరో ప్రమాదం..
విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో మరోసారి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పలు దుకాణాలు దగ్ధం అయ్యాయి. లక్షల్లో ఆస్తినష్టం సంభవించినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆకతాయిలు నిప్పుపెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. సింగరేట్ కాల్చి దుకాణాలపై వేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. సీసీ కెమెరాలు, మత్స్యకారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

దంచికొడుతున్న వర్షాలు..
తమిళనాడులో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్ని నీటమునిగాయి. వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రహదారులు నదులను తలపిస్తున్నాయి. మరోవైపు చండీగఢ్‌లో వర్షం దంచికొడుతోంది. ఉరుములు మెరుపులుతో కూడిన వర్షం పడుతోంది. పలు చోట్ల… చెట్లు నేలకూలడంతో.. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రహదారులపై నీరు ఉధృతంగా ప్రవహించడంతో వాహనాదారులు అవస్థలు పడుతున్నారు.

దుబాయ్ టూర్..
‘కాప్‌- 28′ ప్రపంచ వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దుబాయ్ బయల్దేరి వెళ్లారు. వాతావరణ మార్పులను సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు తగిన ఆర్థిక సాయం, సాంకేతికత అందజేయాలంటూ.. ప్రయాణానికి ముందు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యల విషయంలో భారత్ కేవలం మాటలకే పరిమితం కాలేదని అన్నారు. జీ20 కూటమికి భారత్‌ అధ్యక్షత వహించిన సమయంలోనూ ఈ అంశానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు.

సిరీస్‌పై గురి!
నేడు భారత్‌, ఆసీస్‌ జట్ల మధ్య 4వ టీ20 మ్యాచ్ జరగనుంది. తొలి రెండు వన్డేల్లో టీమిండియా విజయం సాధించగా.. మూడో వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించింది. నాల్గో వన్డేలో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకునేందుకు టీమిండియా పట్టుదలతో ఉంది. ఇవాళ రాత్రి 7గంటలకు రాయ్‌పూర్‌ వేదికగా మ్యాచ్ జరుగుతుంది.