Tollywood Drugs Case : టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. విచారణ తేదీలు ప్రకటించిన ఈడీ

డ్రగ్స్ కేసులో ఈ నెల 31 నుంచి విచారణ ప్రారంభించనుంది ఈడీ.. సెప్టెంబర్ 22 లోగ సినీ స్టార్స్ విచారణ ముగించేలా సమన్లు జారీ చేసింది.

Tollywood Drugs Case : టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. విచారణ తేదీలు ప్రకటించిన ఈడీ

Tollywood Drugs Case

Updated On : August 25, 2021 / 8:19 PM IST

Tollywood Drugs Case : డ్రగ్స్ కేసులో ఈ నెల 31 నుంచి విచారణ ప్రారంభించనుంది ఈడీ.. సెప్టెంబర్ 22 లోగ సినీ స్టార్స్ విచారణ ముగించేలా సమన్లు జారీ చేసింది. ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రాణా దగ్గుబాటి, రవితేజ, పూరి జగన్నాథ్, నవదీప్, ముమైత్ ఖాన్, తరుణ్,నందు, శ్రీనివాస్ కు ఈడీ సమన్లు ఇచ్చింది.

ఇక పూరి జగన్నాథ్ ఆగస్టు 31 విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు, ఛార్మి సెప్టెంబర్ 2, రకుల్ ప్రీత్ సింగ్ సెప్టెంబర్ 6, రాణా దగ్గుబాటి సెప్టెంబర్ 8, రవితేజ, శ్రీనివాస్ సెప్టెంబర్ 9, నవదీప్, ఎఫ్ క్లబ్ జీఎం సెప్టెంబర్ 13, ముమైత్ ఖాన్ సెప్టెంబర్ 15, తనీష్ సెప్టెంబర్ 17, నందు సెప్టెంబర్ 20, తరుణ్ సెప్టెంబర్ 22న విచారణకు హాజరు కావాలని తెలిపింది.