Tongue Scraping: టంగ్ క్లీనింగ్‌తో ఇన్ని లాభాలా..!

రోజూ నాలుకను శుభ్రం చేసుకోవడం వల్ల నాలుకపై ఉండే మృత కణాలు, నాలుకకు అతుక్కుపోయిన పదార్థాలు తొలగిపోతాయి. దీనివల్ల నాలుక శుభ్రంగా ఉండి, ప్రతి రుచిని మరింత ఎక్కువగా, త్వరగా గుర్తించగలుగుతుంది.

Tongue Scraping: టంగ్ క్లీనింగ్‌తో ఇన్ని లాభాలా..!

Tongue Scraping

Updated On : June 21, 2022 / 5:31 PM IST

Tongue Scraping: అందరూ రెగ్యులర్‌గా బ్రష్ చేసుకుంటూ దంతాలను శుభ్రం చేసుకుంటారు. కానీ, నాలుకను శుభ్రం చేసుకోవడం గురించి ఆలోచించరు. ప్రతి రోజూ పళ్లు తోముకోవడం వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో, టంగ్ క్లీనింగ్ వల్ల కూడా అన్ని ఉపయోగాలే ఉన్నాయంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్. అందుకే ప్రతిరోజూ తప్పనిసరిగా టంగ్ క్లీనర్‌తో నాలుకను శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.

Tiger Search: ఇంకా చిక్కని పులి.. కొనసాగుతున్న గాలింపు

దీనివల్ల నోరు శుభ్రంగా ఉండటమే కాదు.. ఇతర అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి అంటున్నారు. రోజూ నాలుకను శుభ్రం చేసుకోవడం వల్ల నాలుకపై ఉండే మృత కణాలు, నాలుకకు అతుక్కుపోయిన పదార్థాలు తొలగిపోతాయి. దీనివల్ల నాలుక శుభ్రంగా ఉండి, ప్రతి రుచిని మరింత ఎక్కువగా, త్వరగా గుర్తించగలుగుతుంది. నోట్లో ఉండే బ్యాక్టీరియా వల్లే దుర్వాసన, దంతక్షయం వంటి సమస్యలు వస్తాయి. అయితే, రోజూ నాలుకను శుభ్రం చేసుకోవడం వల్ల బ్యాక్టీరియా నశిస్తుంది. చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది. మంచి బ్యాక్టీరియా పెరిగి, నోరు ఆరోగ్యంగా ఉంటుంది. నోటి నుంచి దుర్వాసన రాదు. ఆహారం జీర్ణమవడం అనేది నోటి నుంచే ప్రారంభమవుతుంది. నోట్లోని లాలాజలంలో ఉండే ఎంజైమ్‌లు ఆహారాన్ని విడగొట్టి, పేగులలోకి పంపుతాయి. అక్కడ్నుంచి ఆహారం జీర్ణాశయం చేరుకుంటుంది. ఇది ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు చాలా ఉపయోగపడుతుంది.

Venkaiah Naidu: వెంకయ్య దారెటు? రాష్ట్రపతి అభ్యర్థా..? ఉప రాష్ట్రపతిగా కొనసాగింపా?

కాబట్టి, నోట్లో మంచి లాలాజలం ఉత్పత్తి కావాలంటే నాలుక శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. నాలుకను క్లీన్ చేసుకోవడం వల్ల ఒంట్లోని మలినాలు కూడా తొలగిపోతాయి. దీనివల్ల మెల్లిగా, శరీరంలోని ఇతర అవయవాలు కూడా యాక్టివేట్ అవుతాయి. దీంతో అంతర్గత అవయవాలు రోజంతా సమర్ధంగా పనిచేస్తాయి. రోజుకు రెండుసార్లు టంగ్ క్లీన్ చేసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు నిపుణులు. టంగ్ క్లీనింగ్ వల్ల నోట్లోని బ్యాక్టీరియా తొలగిపోతుంది. దీనివల్ల విషపదార్థాలు తగ్గుతాయి. ఫలితంగా వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.