చైనాతో అమెరికా సంబంధాలు కట్…జిన్ పింగ్ తో మాట్లాడనన్న ట్రంప్

  • Published By: venkaiahnaidu ,Published On : May 15, 2020 / 09:58 AM IST
చైనాతో అమెరికా సంబంధాలు కట్…జిన్ పింగ్ తో మాట్లాడనన్న ట్రంప్

Updated On : October 31, 2020 / 2:49 PM IST

కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికా,కమ్యూనిస్ట్ దేశం చైనా మధ్య మరింత చిచ్చు రాజేస్తోంది. కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచే పుట్టిందంటూ చైనా పేరు వినబడితేనే బుసలుకొడుతున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. వైరస్ విషయంలో చైనా వ్యవహరించిన తీరు వల్లే అమెరికా సహా ప్రపంచంలోని ఇతర దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ట్రంప్ బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. వైరస్ మహమ్మారి కారణంగా మొదలైన చిచ్చు కారణంగా ఇప్పుడు రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారే సంకేతాలు వెలువడుతున్నాయి. దీనికి అమెరికా అధ్యక్షుడు చేసిన తాజాగా వ్యాఖ్యలే సాక్ష్యం.

గురువారం ఓ ఇంటర్వ్యూలో…చైనా అధ్యక్షుడితో తనకు మంచి సంబంధాలే ఉన్నాయని పదే పదే చెప్పిన ట్రంప్, ప్రస్తుతం తనకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో మాట్లాడే ఆసక్తిలేదన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టిడి చేయడంలో చైనా విఫలం కావడం తమను చాలా నిరుత్సాహానికి గురిచేసిందని ట్రంప్ అన్నారు. జనవరిలో చైనా-అమెరికా మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందంపై దీని ప్రభావం చూపుతోందన్నారు.

వాణిజ్య ఒప్పందాన్ని ఇరు దేశాల మధ్య కుదిరిన ఒక పెద్ద విజయంగా గతంలో అభివర్ణించిన ట్రంప్… వాణిజ్య ఒప్పందంలో సిరా కేవలం పొడిగా ఉందని వ్యాఖ్యానించారు. చైనా దేశం ఇలా జరగనివ్వకుండా ఉండాల్సిందని ట్రంప్ అన్నారు. తాను చైనాతో గొప్ప ట్రేడ్ డీల్ చేశానని, అయితే ప్రస్తుతం అది తనకు గొప్పగా అనిపించట్లేదన్నారు. వాణిజ్య ఒప్పందంలో సిరా కేవలం పొడిగా ఉందని ట్రంప్ అన్నారు. 

నేషనల్ సెక్యూరిటీ సంబంధిత విభాగాల్లో చదువుకునేందుకు అప్లయ్ చేస్తున్న చైనా విద్యార్ధులకు అమెరికా వీసాలు నిరాకరించాలన్న ఓ రిపబ్లిక్ సెసెటర్ సూచనను గురించి ట్రంప్ ను ఈ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా…మేము చేయగలిగినవి చాలా ఉన్నాయి. మేము చేయగలము. చైనాతో మొత్తం సంబంధాలు  తెంచుకోడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అని ట్రంప్ సమాధానమిచ్చారు.

చైనా నుంచి అంచనా వేసిన వార్షిక దిగుమతులను ప్రస్తావించిన ట్రంప్.. ఇప్పుడు ఒప్పందం నుంచి వైదొలగితే, ఏమి జరుగుతుంది? 500 బిలియన్ డాలర్లను ఆదా చేస్తామని ట్రంప్ అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై చైనా స్పందించింది. చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్‌ ఎడిటర్ ఇన్ చీఫ్ హు జిన్‌జిన్ ఓ ట్వీట్ లో…ఈ అధ్యక్షుడు ఒకసారి కోవిడ్ -19 రోగులకు క్రిమిసంహారక మందులు వేయమని సూచించారు.. ఇది గుర్తుంచుకోండి, అతను చైనాతో ఉన్న మొత్తం సంబంధాలను తెంచుకోగలమని చెప్పినప్పుడు ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు.

కాగా,కరోనా ప్రభావం అమెరికాలో తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. కరోనా దెబ్బకు అమెరికా అతలాకుతలం అయింది. ప్రపంచంలో ఏ దేశంలో లేనన్ని కరోనా కేసులు,మరణాలు అమెరికాలో నమోదయ్యాయి. అమెరికాలో ఇప్పటివరకు దాదాపు 14లక్షల 58వేల మందికి కరోనా సోకగా,87వేల మరణాల నమోదయ్యాయి. ఒక్క న్యూయార్క్ రాస్ట్రంలోనే 3లక్షల 53వేలకు పైగా కేసులు,27వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి.

Read Here >>డ్రాగన్ కోరలు పీకేందుకు భారత్ కు అమెరికా సాయం…18పాయింట్ ఫ్లాన్ ఆవిష్కరించిన సెనెటర్