పెళ్లి కొడుకు అవుతున్న ‘టక్ జగదీష్’

Tuck Jagadish Release Date: నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి సున్నితమైన ప్రేమకథల్ని తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ చేస్తున్నాడు.
రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన టీమ్ తాజాగా తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ రిలీజ్ డేట్‌తో కూడిన పోస్టర్ విడుదల చేశారు.
https://10tv.in/nanis-tuck-jagadish-firstlook/
ఈ పోస్టర్లో కుటుంబ సభ్యులు నానిని పెళ్లి కొడుకును చేస్తున్నారు. బనియన్, పట్టు పంచెలో నాని సరికొత్త లుక్‌లో ఆకట్టుకుంటున్నాడు. 2021 ఏప్రిల్ 16న ‘టక్ జగదీష్’ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రానున్నాడు. నాజర్, జగపతిబాబు, నరేష్, రావు రమేష్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. సంగీతం : థమన్, కెమెరా : ప్రసాద్ మూరెళ్ల, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి.