Uddhav back as editor: పవార్, మమతలను టార్గెట్ చేసిన ఉద్ధవ్
విపక్షాలపై ఈ దాడులను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనపై ఎన్సీపీ, టీఎంసీ ఎందుకు స్పందించలేదని సామ్నా ప్రశ్నించింది. అలాగే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు చేయని వ్యవహారంలో మమతాబెనర్జీపై కూడా సామ్నా మొట్టమొదటి సారి విమర్శలు గుప్పించింది. విపక్షాలు ఐక్యంగా లేకపోతే విపక్షాలకే ప్రమాదమని, బీజేపీ ప్రతీకార రాజకీయాలకు బలికావాల్సి వస్తుందని సామ్నా సంపాదకీయంలో ఉద్ధవ్ హెచ్చరికలు చేశారు.

Uddhav targets NCP and TMC an saamana editor
Uddhav back as editor: సామ్నా పత్రిక ఎడిటర్‌గా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే తిరిగి బాధ్యతలు చేపట్టారు. వస్తూ వస్తూనే మహా వికాస్ అగాఢీ మిత్రపక్షం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. రెండు రోజుల క్రితం అధిక ధరలు, నిరుద్యోగం, జీఎస్టీలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ చేపట్టిన నిరసనలో ఆ రెండు పాల్గొనకపోవడాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆయన తిరిగి సామ్నా కార్యాలయంలో ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టారు.
విపక్ష నేతలపై కేంద్రప్రభుత్వం ఈడీ, సీబీఐలతో దాడులు చేపిస్తూ వేధిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నిరసన కార్యక్రమంలో ప్రతిపక్షాల నేతలు పాల్గొనక పోవడాన్ని ఉద్ధవ్ ఠాక్రే తన సంపాదకీయంలో ప్రస్తావించారు. రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీలపై పోలీసులు ప్రవర్తించిన తీరును ప్రముఖంగా ప్రస్తావించారు. దీనితో పాటు శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ అరెస్టు చేసేటప్పుడు పోలీసులు చూపించిన ప్రతాపాన్ని సామ్నా ఖండించింది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీల నేతల పాత్రను ప్రశ్నార్థకం చేస్తూ ఈడీ దాడులు చేయడాన్ని ఉద్ధవ్ తన సంపాదకీయంలో వ్యతిరేకించారు.
విపక్షాలపై ఈ దాడులను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనపై ఎన్సీపీ, టీఎంసీ ఎందుకు స్పందించలేదని సామ్నా ప్రశ్నించింది. అలాగే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు చేయని వ్యవహారంలో మమతాబెనర్జీపై కూడా సామ్నా మొట్టమొదటి సారి విమర్శలు గుప్పించింది. విపక్షాలు ఐక్యంగా లేకపోతే విపక్షాలకే ప్రమాదమని, బీజేపీ ప్రతీకార రాజకీయాలకు బలికావాల్సి వస్తుందని సామ్నా సంపాదకీయంలో ఉద్ధవ్ హెచ్చరికలు చేశారు.
Kapil Sibal on SC: న్యాయవ్యవస్థపై నమ్మకం లేదన్న సిబల్.. న్యాయవాదుల విమర్శలు