Postage Stamp on Covaxin : కొవాగ్జిన్ టీకాపై పోస్టల్ స్టాంపు విడుదల చేసిన ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ
దేశంలో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమై సంవత్సరమైంది. ఈ సందర్భంగా కేంద్రం ప్రభుత్వం కరోనా నియంత్రణకు భారత్ బయోటెక్, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవాగ్

Minister Mansukh Mandaviya Launches Postage Stamp On Covaxin
Minister Mansukh Mandaviya launches postage stamp on Covaxin : దేశంలో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమై సంవత్సరమైంది. ఈ సందర్భంగా కేంద్రం ప్రభుత్వం కరోనా నియంత్రణకు భారత్ బయోటెక్, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాపై కేంద్ర ప్రభుత్వం పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. భారత్ లో కరోనా నియంత్రణ కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యాక్సిన్ ఇప్పటికే 70శాతంమందికి అందింది. కరోనా మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.
శాస్త్రవేత్తల కృషితో అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ తో కరోనా కట్టిడి అయ్యింది. ఇది దేశ ప్రజలకు వ్యాక్సిన్ ఊరటనిచ్చిందని చెప్పాల్సిందే. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన టీకా కోవాగ్జిన్ చక్కటి ఫలితాలనిచ్చింది.ఈక్రమంలో దేశంలో కరోనా టీకా పంపిణీ ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదివారం (జనవరి 16,2022) కోవాగ్జిన్ టీకాపై పోస్టల్ స్టాంపును విడుదల చేశారు.
also read :Dolo 650: రికార్డ్ స్థాయిలో డోలో సేల్స్… 10నెలల్లో రూ.567కోట్లు
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో కరోనా టీకా పంపిణీ అంకిత భావంతో ఓ యజ్ఞంలా జరిగిందని..భారత్ లో జరిగిన ఈ వ్యాక్సిన యజ్ఞాన్ని చూసి యావత్ ప్రపంచం మొత్తం నివ్వెరపోయిందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కలలుకన్న ‘స్వావలంబన భారత్’ సాధనలో కొవాగ్జిన్ టీకా తయారీ ఓ కీలక పరిణామం అని ఇది భారత్ సాధించిన ఘనత అని తెలిపారు. ఇంత భారీ జనాభా కలిగిన భారత్ లో వ్యాక్సిన్ తో కోవిడ్ ను కట్టడి చేయటం అనేది చాలా గొప్ప విషయం అని ఈ విషయంపై ప్రపంచ దేశాలు కూడా ఆశ్చర్యపోయాయని తెలిపారు. భారతదేశం 156 కోట్ల డోస్‌లు అందిజేసిన మైలురాయిని సాధించగలిగిందని మంత్రి తెలిపారు.
కొవిడ్‌పై పరిశోధనలు, దేశీయంగా కరోనా టీకా అభివృద్ధిని మోదీ ప్రోత్సహించారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ప్రభుత్వం, ప్రైవేటు రంగం సంయుక్తంగా కృషి చేయడం వల్లే కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే దేశీయ కరోనా టీకా అందుబాటులోకి వచ్చిందని..ఇది చాలా గొప్ప విషయం అని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు.
आज #1YearOfVaccineDrive के अवसर पर PM @NarendraModi जी के ‘आत्मनिर्भर भारत’ के सपने को साकार करते हुए, ICMR और भारत बायोटेक ने मिलकर जो स्वदेशी कोवैक्सीन विकसित की है, उस पर डाक टिकट जारी किया गया है।
मैं सभी वैज्ञानिकों को इस अवसर पर हार्दिक बधाई व धन्यवाद देता हूं। pic.twitter.com/3SKE2wvUqE
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) January 16, 2022