పొట్టకూటికోసం వెళితే దొరికిన లంకెబిందెలు..పట్టుకుని పరుగెత్తిన కూలీలు

  • Published By: nagamani ,Published On : December 12, 2020 / 04:15 PM IST
పొట్టకూటికోసం వెళితే దొరికిన లంకెబిందెలు..పట్టుకుని పరుగెత్తిన కూలీలు

Updated On : December 12, 2020 / 4:22 PM IST

UP  laborer absconded  mughal coins in kanpur : పొట్టకూటికోసం పొలంలో పనిచేయటానికి వెళ్లిన కూలీలకు లంకెబిందెలు దొరికాయి. దీంతో వాళ్లు కళ్లు మెరిసిపోయాయి. తాము చూసేది నిజమా కాదా? అని ఆశ్చర్యంగా ఆ లంకెబిందెల కేసి చూస్తుండిపోయారు. అనంతరం తేరుకుని ఆ లంకెబిందెలు పట్టుకుని పరిగెత్తుకెళ్లిపోయారు. ఈ విషయం ఆనోటా..ఈనోటా తెలిసి పోలీసులు రంగంలోకి దిగారు. ఇంకేముంది పాపం ఆ శ్రమజీవుల ఆనందం అంతా ఆవిరైపోయింది.

వివరాల్లోకి వెళితే..యూపీలోని కాన్పూర్‌లోని సురార్ గ్రామానికి చెందిన బ్రజ్ కిషోర్ పాండేయ్‌కు గ్రామం చివరిలో వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిలో మొక్కలు నాటించేందుకు కూలీలను పెట్టుకున్నాడు.కూలీలతో పాటు బ్రజ్ కిషోర్ కూడా మొక్కలు నాటటానికి గుంతలు తవ్వుతుండాగా ఓ చోట వారికి ఓ మట్టి పాత్ర బైటపడింది.

దాన్ని జాగ్రత్తగా బైటకు తీయగా..దానిలోని నాణాలను బ్రజ్ కిషోర్ పాండేయ్‌తో పాటు కూలీలు పంచుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ విషయం ఆనోటా ఈనోటా దావానంలా పాకి పోలీసుల వరకూ వెళ్లింది. ఇంకేముంది పోలీసులు రంగంలోకి దిగారు.

బ్రజ్ కిషోర్ తో పాటు కూలీలను కూడా వెతికి పట్టుకుని..వారి నుంచి మట్టిపాత్రతో పాటు నాణాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని నిపుణులకు చూపింపి పరిశీలించగా ఆ పాత్ర, నాణాలు మొఘలుల కాలంనాటివని తెలిసింది. మొత్తం 35నాణాలపై ఆ నాణాలపై ఉర్దూలో రాసివుంది.