Sri Rama Navami : తెలుగు సినిమాలు.. శ్రీరామనవమి శుభాకాంక్షలు..

తెలుగు ప్రజలందరికీ అప్‌కమింగ్ సినిమాల మేకర్స్ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు చెబుతూ, తమ సినిమాల పోస్టర్స్ రిలీజ్ చేశారు. మాస్ మహారాజా రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ‘ఖిలాడి’ మూవీ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు..

Sri Rama Navami : తెలుగు సినిమాలు.. శ్రీరామనవమి శుభాకాంక్షలు..

Upcoming Telugu Movie Makers Wishing Everyone Happy Sri Rama Navami

Updated On : April 22, 2021 / 12:13 PM IST

Sri Rama Navami: తెలుగు ప్రజలందరికీ అప్‌కమింగ్ సినిమాల మేకర్స్ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు చెబుతూ, తమ సినిమాల పోస్టర్స్ రిలీజ్ చేశారు. మాస్ మహారాజా రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ‘ఖిలాడి’ మూవీ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు.

KHILADI

రానా దగ్గుబాటి, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా, వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘విరాట పర్వం’ (రివల్యూషన్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ లవ్).. సురేష్ ప్రొడక్షన్స్ డి.సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి.సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ‘విరాట పర్వం’ వాయిదా పడింది.. సోషల్ మీడియా ద్వారా శ్రీ రామ నవమి విషెస్‌ తెలిపింది టీమ్..

Virata Parvam

యూత్ స్టార్ నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ట్రో’.. బాలీవుడ్ ‘అంధాధూన్’ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. నితిన్, నభా నటేష్‌తో కలిసి బైక్ మీద వెళ్తున్న పోస్టర్ విడుదల చేశారు..

MAESTRO

మంచు విష్ణు, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వచ్చిన ‘ఢీ’ మూవీ ఏ రేంజ్ సక్సెస్ అయిందో తెలిసిందే.. చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడీ సినిమాకి సీక్వెల్ రాబోతోంది. ‘ఢీ & ఢీ – డబుల్ డోస్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. శ్రీ రామ నవమి శుభాకాంక్షలతో త్వరలో షూటింగ్ స్టార్ట్ కానుందని తెలిపారు.

D&D

నేచురల్ స్టార్ నాని, రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా.. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి సున్నితమైన ప్రేమకథల్ని తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన చిత్రం ‘టక్ జగదీష్’.. పండుగ సందర్భంగా కొత్త పోస్టర్ వదిలారు.

TuckJagadish

వీటితో పాటు సంతోష్ శోభన్ నటిస్తున్న ‘ఏక్ మినీ కథ’ సినిమాలోని ‘సామిరంగా’ అనే సాంగ్, నవీన్ చంద్ర ‘నేను లేని.. నా.. ప్రేమకథ’, నందు, రష్మి నటిస్తున్న ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ పోస్టర్.. కమెడియన్ మధునందన్ హీరోగా నటిస్తున్న ‘గుండె కథ వింటారా’ మూవీలోని ‘ఎంతబావుందో’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు..

Bomma Blockbuster