Vakeel Saab : ‘వకీల్ సాబ్’ కోసం ఎవరెంత తీసుకున్నారంటే..

దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. లేట్ అయినా లేటెస్ట్‌గా అన్నట్లు బాక్సాఫీస్ బరిలో రికార్డ్స్ క్రియేట్ చేశారు..

Vakeel Saab : ‘వకీల్ సాబ్’ కోసం ఎవరెంత తీసుకున్నారంటే..

Vakeel Saab

Updated On : April 25, 2021 / 6:06 PM IST

Vakeel Saab: దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. లేట్ అయినా లేటెస్ట్‌గా అన్నట్లు బాక్సాఫీస్ బరిలో రికార్డ్స్ క్రియేట్ చేశారు.. ఫ్యాన్స్, మూవీ లవర్స్, ప్రేక్షకులు ముఖ్యంగా మహిళామణులు ‘వకీల్ సాబ్’ కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

‘వకీల్ సాబ్’ తో పవన్ సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చారంటూ ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు.. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా చూసి ట్వీట్స్ చేశారు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితే ఎమోషనల్ అయిపోయి పవన్‌ను హత్తుకున్నారు..

Vakeel Saab : ‘వకీల్ సాబ్’ చూసి తారక్, పవన్ కళ్యాణ్‌ని హత్తుకున్నాడు..

ఈ సినిమా కోసం నటీనటులు ఎంతెంత పారితోషికాలు తీసుకున్నారనే వివరాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. ఆ సమచారం ప్రకారం ‘వకీల్ సాబ్’ నటుల రెమ్యునరేషన్ వివరాలు ఇలా ఉన్నాయి.. పవన్ కళ్యాణ్ – రూ. 50 కోట్లు (దీనితో పాటు లాభాల్లో మరో 15 కోట్లు వాటా తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది).. ప్రకాష్ రాజ్ – 1 కోటి, శృతి హాసన్ – 75 లక్షలు, నివేదా థామస్ – 75 లక్షలు, అంజలి – 50 లక్షలు, అనన్య నాగళ్ల – 30 లక్షలు..