Vakeel Saab : ‘వకీల్ సాబ్’ చూసి తారక్, పవన్ కళ్యాణ్‌ని హత్తుకున్నాడు..

దాదాపు మూడేళ్ల తర్వాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ గా వచ్చి బాక్సాఫీస్ బరిలో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు. హిందీ ‘పింక్’, తమిళ్ ‘నేర్కొండపార్వై’ ని మించి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఫ్యాన్స్, మూవీ లవర్స్, మాములు ప్రేక్షకులు ముఖ్యంగా మహిళామణులు ‘వకీల్ సాబ్’ కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు..

Vakeel Saab : ‘వకీల్ సాబ్’ చూసి తారక్, పవన్ కళ్యాణ్‌ని హత్తుకున్నాడు..

Vakeel Saab

Vakeel Saab: దాదాపు మూడేళ్ల తర్వాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ గా వచ్చి బాక్సాఫీస్ బరిలో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు. హిందీ ‘పింక్’, తమిళ్ ‘నేర్కొండపార్వై’ ని మించి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఫ్యాన్స్, మూవీ లవర్స్, మాములు ప్రేక్షకులు ముఖ్యంగా మహిళామణులు ‘వకీల్ సాబ్’ కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

Vakeel Saab

ఇక సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా ద్వారా పవర్ స్టార్‌ని, ‘వకీల్ సాబ్’ టీంని అభినందిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా గురించి ట్వీట్ చెయ్యగా.. మెగాస్టార్ చిరంజీవి.. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శ్రీరామ్ వేణు, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌లను ప్రత్యేకంగా ఇంటికి పిలిపించుకుని మరీ అభినందించారు.

Vakeel Saab

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘వకీల్ సాబ్’ సినిమా చూసి పవన్ కళ్యాణ్‌ని హత్తుకున్నారని ఓ ఇంటర్వూలో ప్రకాష్ రాజ్ చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘‘వకీల్ సాబ్’ సినిమా చూసిన తర్వాత చిరంజీవి చాలా బాగా నటించారంటూ మెచ్చుకున్నారు. ఆయనలాంటి గొప్ప వ్యక్తి మన మధ్య ఉండడం మన అదృష్టం.. చిన్నా పెద్దా అనే తేడా చూపించరు.. అందర్నీ ఎంకరేజ్ చేస్తారు.. అదే అన్నయ్య గొప్ప మనసు.. మహేష్ సినిమా చూసి ట్వీట్ చేశారు.. రీసెంట్‌గా ఎన్టీఆర్ ‘వకీల్ సాబ్’ చూశారు. పవన్‌ని కలిసి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు తారక్.. సోషల్ మెసేజ్ ఉన్న సినిమా, సమాజాన్ని చైతన్య పరిచే కథతో ప్రేక్షకుల ముందుకువస్తే ఆ గుర్తింపు, గౌరవం ఎలా ఉంటుందో చెప్పడానికి ‘వకీల్ సాబ్’ మంచి ఉదాహరణ’’.. అన్నారు.