Padma Lakshmi: చాలా గర్వంగా ఉంది.. హాట్ ఫోటోలపై లక్ష్మి స్పందన!

పద్మలక్ష్మి.. ఈ పేరు మన తెలుగు వారికి పెద్దగా పరిచయం లేదు కానీ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారికి బాగానే తెలుసు. ఆమె వయసు 50 ఏళ్లు..

Padma Lakshmi: చాలా గర్వంగా ఉంది.. హాట్ ఫోటోలపై లక్ష్మి స్పందన!

Very Proud Padma Lakshmi Response On Hot Photos

Updated On : May 21, 2021 / 11:59 AM IST

Padma Lakshmi: పద్మలక్ష్మి.. ఈ పేరు మన తెలుగు వారికి పెద్దగా పరిచయం లేదు కానీ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారికి బాగానే తెలుసు. ఆమె వయసు 50 ఏళ్లు.. పెళ్లై, పిల్లలు పుట్టినా తనలోని హాట్ నెస్‌కు మెరుగులు దిద్ది ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. ఆ మధ్య బాత్ టబ్‌లో నగ్నంగా పడుకుని ఫొటోకి పోజు ఇచ్చినా టీవీ షో యాంకరింగ్ చేస్తూ సెగలు రేపినా.. బీచ్ లో బికినీ వేసి కుర్రాళ్ళ హృదయాలను కుదిపేసినా పద్మాలక్షికే చెల్లింది.

పద్మలక్ష్మి అని ఇంత చక్కగా మనకు దగ్గరైన పేరులాగే ఉంది.. ఆమె యవ్వారం చూస్తే మాత్రం హాలీవుడ్ రేంజులో ఉంది ఏంటి అనుకుంటున్నారా? నిజమే మరి. పద్మలక్ష్మి.. పుట్టింది చెన్నైలో, పెరిగింది అమెరికాలో. ఈమె పూర్తి పేరు పార్వతి లక్ష్మి వైద్యనాధన్. అమెరికన్ పౌరసత్వం కలిగిన పద్మలక్ష్మిలో చాలా మల్టీటాలెంట్స్ ఉన్నాయి. రచయిత్రి, నటి, మోడల్, టీవీ వ్యాఖ్యాత, నిర్మాతగా పాపులర్ అయిన పద్మ లక్ష్మి తాజాగా ఓ ఇంట్వ్యూలో చాలా విషయాలపై మాట్లాడారు.

ఆడవాళ్లు ఎలా ఉండాలో వారే నిర్ణయించుకోనే హక్కు నుండి ఇమ్మిగ్రేషన్, బ్లాక్ లైవ్స్ మేటర్, మహిళల హక్కులు, ఎండోమెట్రియోసిస్ చాలా అంశాలపై మాట్లాడిన పద్మలక్ష్మి తన హాట్ ఫోటోలపై కూడా స్పందించారు. ముందుగా ఆ ఫోటోలలో నేను అందంగా కనిపిస్తున్నందుకు గర్వపడుతున్నానని చెప్పిన లక్ష్మి నేను 23, 25 ఏళ్ళ వయసులో వేసుకున్నప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు చేస్తున్నారని మండిపడ్డారు.