Tomato Prices : అమ్మబాబోయ్.. కేజీ టమాటా రూ.300? త్వరలోనే భారీగా పెరగనున్న ధర, షాకింగ్ న్యూస్ చెప్పిన వ్యాపారులు

టమాటా ధరల గురించి మరో బాంబు పేల్చారు వ్యాపారులు. త్వరలోనే టమాట ట్రిపుల్ సెంచరీ కొట్టనుందట. Tomato Prices

Tomato Prices : అమ్మబాబోయ్.. కేజీ టమాటా రూ.300? త్వరలోనే భారీగా పెరగనున్న ధర, షాకింగ్ న్యూస్ చెప్పిన వ్యాపారులు

Tomato Prices

Updated On : August 4, 2023 / 1:11 AM IST

Tomato Prices : టమాటా.. ఈ పేరు వింటే చాలు జనాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఒళ్లంతా భయంతో చెమట్లు పట్టేస్తున్నాయి. కాళ్లు చేతులు వణుకుతున్నాయి. టమాను టచ్ చేయడం అటుంచితే, కనీసం అటువైపు చూసేందుకు కూడా జనాలు సాహసం చేయడం లేదంటే అతిశయోక్తి కాదు. అంతగా టమాట ధరలు మండిపోతున్నాయి. తాజాగా టమాటా ధరల గురించి మరో బాంబు పేల్చారు వ్యాపారులు. త్వరలోనే టమాట ట్రిపుల్ సెంచరీ కొట్టనుందట. కేజీ టమాట ధర రూ.300 కానుందట.

వంద నుంచి రెండు వందలు దాటిన కిలో టమాట ధరలు తాజాగా రూ.300కు చేరువయ్యే దిశగా పరుగులు పెడుతోంది. త్వరలోనే ట్రిపుల్ సెంచరీ మార్క్ కు చేరువ అవుతుందని వ్యాపారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక 300లకు దగ్గర అవునుంది టమాట ధర. దేశ రాజధాని ఢిల్లీలో టమాట ధరలు విపరీతంగా పెరిగాయి.

Also Read..Laptop Imports: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌ల దిగుమతిపై నిషేధం.. కారణం ఏంటో తెలుసా?

రిటైల్ స్టోర్స్ లో కిలో టమాట 259 రూపాయలకు అమ్ముతున్నారు. ఇప్పటికే సామాన్యుడికి అందని స్థాయిలో 200 రూపాయల దాటేసింది టమాట ధర. మొదట తగ్గినట్లే అనిపించినా క్రమంగా బ్రేకులు లేకుండా టమాటా రేట్లు భగ్గుమన్నాయి. ఈ మధ్య కాలంలో కురిసిన భారీ వర్షాలు కూడా టమాటా ధరలు పెరగడానికి కారణం అయ్యాయి. రవాణకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో సరఫరా తగ్గిపోయింది. పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ధర పెరిగింది. మరికొన్ని రోజుల్లోనే కిలో టమాటా ధర రూ.300లకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నాయి వ్యాపార వర్గాలు.

ఆపిల్స్ ను తలదన్నేలా మార్కెట్ లో టమాట ధర ఉంది. ఇప్పుడు చికెన్ కూడా టమాట రేటు ముందు చిన్నబోతోంది అంటే ఏ రేంజ్ లో టమాట రేటు పెరుగుదల ఉందో అర్థం చేసుకోవచ్చు. గత కొన్నేళ్లుగా టమాట పంటకు గిట్టుబాటు ధర లేక రోడ్లపైనే పడేసే పరిస్థితి ఉంది. కానీ, ఇప్పుడు టమాట పంట వల్ల రైతుకు లక్షలు, కోట్ల రూపాయల్లో లాభాలు వస్తున్నాయని వ్యాపారులు అంటున్నారు.

Also Read..Mobile Charger : గుండెలు పిండే తీవ్ర విషాదం.. ఫోన్ ఛార్జర్ పిన్ నోట్లో పెట్టుకుని 8నెలల చిన్నారి మృతి, తల్లిదండ్రులూ బీకేర్ ఫుల్