Woman Working Out In Saree: చీరకట్టులో జిమ్‌లో 56 ఏళ్ల మహిళ వ్యాయామం.. వీడియో వైరల్
ప్రతిరోజు వ్యాయామం చేస్తే సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చని అందరికీ తెలుసు. అయితే, వ్యాయామం చేసేందుకు చాలా మంది బద్ధకిస్తుంటారు. యువతలోనూ ఈ ధోరణి విపరీతంగా ఉంది. అయితే, 56 ఏళ్ల ఓ మహిళ చీరకట్టులో జిమ్ లో వ్యాయామం చేస్తూ, బరువులు ఎత్తుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తమిళనాడు రాజధాని చెన్నైకు చెందిన ఈ మహిళకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Woman Working Out In Saree
Woman Working Out In Saree: ప్రతిరోజు వ్యాయామం చేస్తే సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చని అందరికీ తెలుసు. అయితే, వ్యాయామం చేసేందుకు చాలా మంది బద్ధకిస్తుంటారు. యువతలోనూ ఈ ధోరణి విపరీతంగా ఉంది. అయితే, 56 ఏళ్ల ఓ మహిళ చీరకట్టులో జిమ్ లో వ్యాయామం చేస్తూ, బరువులు ఎత్తుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
తమిళనాడు రాజధాని చెన్నైకు చెందిన ఈ మహిళకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ మహిళ తన కోడలితో కలిసి ఈ వ్యాయామాలు చేయడం నేర్చుకుంది. ఆమెతో పాటు మరో ఇద్దరు మహిళలకు జిమ్ లో అవార్డులు కూడా ఇవ్వడం ఈ వీడియోలో చూడొచ్చు.
‘‘నా వయసు 56 ఏళ్లు.. ఇప్పటికే వ్యాయామాలు చేస్తూనే ఉన్నాను. మనం ఏదైనా చేయాలని అనుకుంటే అందుకు మనం ధరించే వస్త్రాలు కూడా అడ్డుకాదు. నా కోడలితో కలిసి నేను ప్రతిరోజు వ్యాయామం చేస్తాను. నాలుగేళ్ల క్రితం నేను తొలిసారి జిమ్ కు వెళ్లాను. ఆ సమయంలో నాకు మోకాళ్లు, కాళ్ల నొప్పులు ఉండేవి. వ్యాయామం చేయాలని నా కుమారుడు నాకు సూచించాడు. అతడికి జిమ్ ఉంది. ఇప్పుడు నా కాళ్ల నొప్పులు తగ్గిపోయాయి’’ అని ఆ మహిళ చెప్పింది. ఆ మహిళ చీరలోనే వ్యాయామాలు చేస్తుండడం నెటిజన్లను అలరిస్తోంది.
View this post on Instagram
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..