Cobra Movie: మళ్లీ వెనక్కి వెళ్లిన కోబ్రా.. ఎప్పుడొస్తున్నాడంటే..?
తమిళ వర్సటైల్ హీరో చియాన్ విక్రమ్ నటించిన ‘కోబ్రా’ మూవీ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చిన చిత్ర యూనిట్, ఎట్టకేలకు ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది. కోబ్రా సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని.. వారి ఎదురుచూపులకు ఆగస్టు 31న తెరపడనుందని చిత్ర యూనిట్ పేర్కొంది.
Cobra Movie: తమిళ వర్సటైల్ హీరో చియాన్ విక్రమ్ నటించిన ‘కోబ్రా’ మూవీ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చిన చిత్ర యూనిట్, ఎట్టకేలకు ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది. అయితే ఆగస్టు 12న అమీర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చడ్డా భారీ ఎత్తున రిలీజ్ అవుతుండటంతో, ఈ సినిమాకు పోటీగా ఉండటం ఇష్టంలేక, కోబ్రా తన రిలీజ్ డేట్‌ను మరోసారి మార్చుకుంది.
Cobra Movie : విక్రమ్ ‘కోబ్రా’ పరిస్థితి ఏంటి?
విక్రమ్ వైవిధ్యమైన గెటప్స్‌లో నటిస్తున్న కోబ్రా చిత్రాన్ని అజయ్ జ్ఞానముత్తు అద్భుతంగా తీర్చిదిద్దడంతో ఈ సినిమాపై తమిళ నాట అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన కొత్త రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. కోబ్రా సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని.. వారి ఎదురుచూపులకు ఆగస్టు 31న తెరపడనుందని చిత్ర యూనిట్ పేర్కొంది.
Chiyaan Vikram: తమిళ్ హీరో విక్రమ్‌కు హార్ట్ఎటాక్.. కావేరీ ఆస్పత్రిలో చికిత్స
కోబ్రా సినిమాలో విక్రమ్ పర్ఫార్మెన్స్ మరో లెవెల్లో ఉండబోతుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో మియా జార్జ్, రోషన్ మాథ్యూ, పద్మప్రియ, మీనాక్షి, తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, 7 స్క్రీన్ స్టూడియో బ్యానర్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేసింది. మరి ఆగస్టు 31న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానున్న కోబ్రా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.