Viral News: రూ.10 కోడిపిల్లకి రూ.50 బస్ టికెట్!
పావలా కోడికి.. ముప్పావలా మసాలా అనే పాత సామెత మీకు గుర్తుండే ఉంటుంది కదా.. ఇప్పుడు ఆ సామెత కాస్త మార్చుకోవాలేమో.. 10 రూపాయల కోడిపిల్లకు 50 రూపాయల టికెట్ అనే సామెతగా మార్చుకోవాలి.

Viral News (1)
Viral News: పావలా కోడికి.. ముప్పావలా మసాలా అనే పాత సామెత మీకు గుర్తుండే ఉంటుంది కదా.. ఇప్పుడు ఆ సామెత కాస్త మార్చుకోవాలేమో.. 10 రూపాయల కోడిపిల్లకు 50 రూపాయల టికెట్ అనే సామెతగా మార్చుకోవాలి. ఇది కర్నాటక ఆర్టీసీ వారి ఘనకార్యం. బస్సులో మనతో పాటు లగేజీ తీసుకువెళితే.. లగేజ్ టికెట్ కూడా వసూలు చేస్తాడు కండక్టర్. ఆ లగేజ్ టికెట్ ప్రయాణికుల టికెట్ తో సమానంగా వుండదు. కానీ కేఎస్ఆర్టీసీ వారి తీరే వేరు.
సంచిలో కోడిపిల్లను తీసుకువెళితే కూడా టికెట్ తీసుకోవాలన్నాడా కండక్టర్. అది కూడా తక్కువేం కాదు. ఏకంగా 50 రూపాయల టికెట్ ఇచ్చాడు. దీంతో అవాక్కవ్వడం ఆ కుటుంబం వంతయింది. హోసనగర వద్ద కేయస్ఆర్టీసీ బస్సు ఎక్కిన ఆ కుటుంబం షిరూరుకు డిసెంబరు 31న ఆర్టీసీ బస్సులో వెళ్తున్నారు. కోడిపిల్లకు కూడా టికెట్ తీసుకోవాలని కండక్టర్ డిమాండ్ చేయగా ఆ కుటుంబం కాసేపు వారించినా ఆ కండక్టర్ వినకుండా టికెట్ కొట్టేశాడు.
బస్సులో కోడిపిల్లకు టికెట్ తీసుకోవాలనే నియమం ఉందని కండక్టర్ చెప్పడంతో చేసేదేం లేక ఆ కుటుంబం ఆ కోడి పిల్ల కోసం హాఫ్ టికెట్ తీసుకుంది. ఇలా రూ.10తో కొనుగోలు చేసిన కోడి పిల్లను తీసుకెళ్లేందుకు.. ఆ కుటుంబం రూ.50 చెల్లించి టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. కోడిపిల్ల టికెట్ తో కలిసి ఆ కుటుంబానికి మొత్తం రూ.353 అయింది. ఈ వ్యవహారాన్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఇది వైరల్ గా మారింది.