Cow Dung : పిడకలు చేయటం ఎలా?వాటి ఉపయోగాలేంటీ?..యూపీలో వర్శిటీ విద్యార్ధులకు ట్రైనింగ్

ఆవుపేడతో పిడకలు చేయటం ఎలా?వాటి ఉపయోగాలేంటీ?.అనేదానిపై యూపీలోని వర్శిటీ ప్రొఫెసర్ విద్యార్ధులకు ట్రైనింగ్ ఇచ్చారు.

Cow Dung : పిడకలు చేయటం ఎలా?వాటి ఉపయోగాలేంటీ?..యూపీలో వర్శిటీ విద్యార్ధులకు ట్రైనింగ్

Banaras Hindu University Students Trains Make Cow Dung Cakes

Updated On : February 8, 2022 / 12:05 PM IST

Banaras Hindu University Students Trains Make Cow Dung Cakes : ఉత్తరప్రదేశ్‌లోని ప్రతిష్టాత్మక బెనారస్ యూనివర్శిటీలో ఆవు పేడతో పిడకలు ఎలా చేయ్యాలో ట్రైనింగ్ ఇచ్చారు. అదేంటీ విద్యార్ధులకు పిడకలు చేయటం నేర్పించటమేంటి? అని ఆశ్చర్యపోతున్నారు. వినటానికి ఇది వింతగా ఉన్నా నిజమే. బెనారస్ వర్శిటిలో క్యాంపస్‌లోని విద్యార్థులకు పిడకలు చేయటం ఎలా? అనేదానిపై ట్రైనింగ్ ఇచ్చారు. పేడ ముద్దను చేత్తో పట్టుకుని దాన్ని గుండ్రంగా ఎలా చేయాలి? దాన్ని పిడకలాగా ఎలా ఒత్తాలి? అని ట్రైనింగ్ ఇచ్చారు.

ఈ వింత వార్తా విశేషాలు ..బెనారస్‌ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ) ఇటీవల ఒక వర్క్‌షాప్‌ను నిర్వహించింది. యూనివర్శిటీ సోషల్ సైన్స్ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ కౌశల్ కిషోర్ మిశ్రా ఈ వర్క్ షాపులో పాల్గొన్నారు. ఆవు పేడతో పిడకలు ఎలా తయారు చేయాలి? అన్నదానిపై విద్యార్థులకు ప్రొఫెసర్ ట్రైనింగ్ ఇచ్చారు. ఈ వర్క్ షాపులో అందరు మగ విద్యార్ధులే ఉండటం విశేషం. పిడకలు చేయటం ఎలాగో విద్యార్ధలకు తాను చేస్తు నేర్పించిన ప్రొఫెసర్ కౌశల్ కిషోర్ మిశ్రా ఆ ఆవుపిడకల ఉపయోగాలేంటో కూడా నేర్పిచారు. ఈ పిడకలతో వంట వండుకోవచ్చని…ముఖ్యంగా ఆవుపేడతో చేసిన పిడకలను యజ్ఞాలు, యాగాల్లో ఉపయోగిస్తారని వివరించారు. అంతేకాదు ఈ పిడకలతో పూజలు కూడా చేస్తారని తెలియజేశారు.

Also read :JNU VC Santishree Dhulipudi : JNU తొలి మహిళా వైస్ చాన్సలర్ గా శాంతిశ్రీ ధూళిపూడి

అంతేగాక తమ విద్యార్థులు గ్రామాలకు వెళ్లి ఆవు పేడతో పిడకలు ఎలా చేయాలన్నదానిపై గ్రామస్తులకు శిక్షణ ఇస్తారని ఆ డీన్‌ తెలిపారు. మొదటగా ఆవుపేడను మెత్తగా పిసికి దాన్ని ముద్దగా చేసి దాన్ని గోడమీదగానీ, నేలమీద గాని పిడకలాగా ఒత్తి ఆరబెట్టాలని అది ఆరిన తరువాత జాగ్రత్త చేసుకోవాలని తెలిపారు. అంతేకాదు ఆవు పేడ పిడకల్ని అమ్మి మంచి ఆదాయం పొందవచ్చని తెలిపారు. వీటి అమ్మకాల కోసం ప్రభుత్వం చక్కటి ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు.

కాగా..విశ్వవిద్యాలయంలోని సమీకృత గ్రామాభివృద్ధి కేంద్రంలో ఇటీవల ఈ వర్క్‌షాప్‌ జరిగినట్లు బెనారస్‌ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ) తెలిపింది. దీనికి సంబంధించిన ఒక వీడియోను కూడా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రధాని కార్యాలయంతోపాటు బీహెచ్‌యూ వీసీ కార్యాలయం, బీహెచ్‌యూ పీఆర్వోకు దీనిని ట్యాగ్‌ చేశారు.

Also read : Mahesh Bank Fraud : సినీ ఫక్కీలో ఛేజ్ చేసి నిందితుడ్ని పట్టుకున్న పోలీసులు

మరోవైపు ఆవు పేడతో పిడకలు తయారు చేయడంపై బెనారస్‌ హిందూ యూనివర్సిటీ విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సెటైర్లు వేస్తున్నాు. మీమ్స్‌, జోకులతో వైరల్ చేస్తున్నారు. గ్రామాల్లోని ప్రజలకు పిడకలు చేయడం బాగా తెలుసు. గ్రామీణులు పిడకలు చేయటంలో అత్యంత నేర్పు కలిగినవారు. మీరు విద్యార్దులకు వర్క్ షాపు పెట్టి మరీ నేర్పిస్తున్నారని చదువుకున్నవారికంటే గ్రామీణులే నమయం సెటైర్లు వేస్తున్నారు.మరికొంతమంది అయితే..వర్శిటీ విద్యార్ధులకు ఇలా పిడకలు ఎలా చేయాలో బాగానే నేర్పిస్తున్నారు. వారి చదువు పూర్తి అయ్యాక ఉద్యోగాలు రాకపోతే పిడకలు చేసుకోవటానికి బాగా ఈ వర్క్ షాపు ఉఫయోగపడొచ్చు..అంటున్నారు. ఇంకొందరైతే..ఉన్నత విద్య చదివే క్యాంపస్సులను ఇలా ఇలా పిడకల తయారీపై శిక్షణ ఇచ్చి వర్సిటీ ప్రమాణాలు, ప్రతిష్ఠను దిగజార్చవద్దని అంటున్నారు.