YS Jagan Mohan Reddy : సీఎం జగన్‌కు విశాఖ శ్రీ శారదాపీఠం ఆహ్వానం

విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఈ రోజు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసారు.

YS Jagan Mohan Reddy : సీఎం జగన్‌కు విశాఖ శ్రీ శారదాపీఠం ఆహ్వానం

YS Jagan Mohan Reddy

Updated On : January 11, 2022 / 1:38 PM IST

YS Jagan Mohan Reddy :  విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఈ రోజు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన ఆయన విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేసారు.

ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలు జరగనున్నాయి.   ఈ వార్షిక మహోత్సవాల్లో సీఎం జగన్  పాల్గొని శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి ఆశీస్సులు పొందాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.
Also Read : YS Jagan : జగన్‌కు రిలీఫ్.. సాక్షిలో పెట్టుబడులపై అనుకూల తీర్పు
స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వెంట ముఖ్యమంత్రిని కలిసిన వారిలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ఉన్నారు.