Vishal : అభిమానులు చేసిన పనికి ఫిదా అయిన విశాల్.. ఫ్యాన్స్ కి గోల్డ్ చైన్స్ బహుకరణ..
తమిళ హీరో విశాల్ తన సినిమాల్లోనే కాక బయట కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నాడు. రైతులు, విద్యార్థులు, అనాధల కోసం ఎప్పుడూ ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాడు విశాల్. విశాల్ లాగే విశాల్ అభిమానులు కూడా..........

Vishal gifted gold chains to the fans who were doing the service programs
Vishal : తమిళ హీరో విశాల్ తన సినిమాల్లోనే కాక బయట కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నాడు. రైతులు, విద్యార్థులు, అనాధల కోసం ఎప్పుడూ ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాడు విశాల్. విశాల్ లాగే విశాల్ అభిమానులు కూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. విశాల్ పేరిట విశాల్ మక్కల్ నల ఇయక్కం (విశాల్ ప్రజా సంక్షేమ సంఘం) స్థాపించి ఆ సంఘం తరుపున తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
విశాల్ అభిమానులు చేసే ఈ కార్యక్రమాలకి విశాల్ కూడా సపోర్ట్ చేస్తాడు. తాజాగా విశాల్ అభిమానులు ఈ సంఘం తరపున 11 పేద జంటలకు వివాహం జరిపించారు. వివాహానికి కావాల్సిన అన్ని వస్తువులని, తాళిబొట్లతో సహా ఉచితంగా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి విశాల్ కూడా విచ్చేసి తన చేతుల మీదుగా ఆ జంటలకు తాళిబొట్లు అందించారు. వివాహాలు జరిగిన అనంతరం సభని ఏర్పాటు చేయగా విశాల్ మాట్లాడుతూ తన అభిమానులని ప్రశంసించారు.
ఇన్స్టాగ్రామ్ వరస్ట్.. ఫోటోలు షేర్ చేసుకోడానికి తప్ప దేనికి పనికిరాదు.. కంగనా సీరియస్ పోస్ట్..
అంతేకాకుండా తన పేరుతో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేస్తున్న అభిమానులకి ధన్యవాదాలు తెలిపి ఇలా సేవా కార్యక్రమాలు నిర్వహించే తన అభిమాన సంఘాలకి చెందిన పలువురికి విశాల్ బంగారు గొలుసులు, బంగారపు ఉంగరాలు బహూకరించాడు. తన చేత్తో విశాల్ తన అభిమానులకి ఆ గోల్డ్ చైన్స్ వేశాడు. దీంతో విశాల్ ఫ్యాన్స్ మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విశాల్ చేసిన పనికి ఫ్యాన్స్ తో పాటు పలువురు అభిమానందిస్తున్నారు.
A Grand Wedding Occasion of 11 Couples,
Truly delighted to be part of this wonderful initiative by #Vishal_Makkal_Nala_Iyakkam, GB#மக்கள்பணியில்#மக்கள்நலஇயக்கம்https://t.co/OjHFGPfD5u
— Vishal Film Factory (@VffVishal) November 7, 2022