Sachin Tendulkar: సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓడిపోవడంపై సచిన్ స్పందన

మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోరును నమోదు చేయలేకపోయిందని సచిన్ టెండూల్కర్ అన్నారు. దీంతో టీమిండియాకు ఆ మ్యాచ్ క్లిష్టతరంగా మారిందని చెప్పారు. తీవ్ర నిరాశకు గురిచేసేలా ఓడిపోయామని అన్నారు. అయితే, టీమిండియా మొత్తానికి టీ20ల్లో బాగానే రాణిస్తోందని, ఆ ఫార్మాట్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని సచిన్ గుర్తు చేశారు. నంబర్ 1 స్థానానికి చేరుకోవడం రాత్రికి రాత్రే సాధ్యమయ్యే పని కాదని సచిన్ టెండూల్కర్ చెప్పారు.

Sachin Tendulkar: సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓడిపోవడంపై సచిన్ స్పందన

Sachin Tendulkar: సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓడిపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసిందని తనకు తెలుసని టీమిండియా మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ అన్నారు. సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో భారత్ 140 వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. రేపు ఇంగ్లండ్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

దీనిపై ఇవాళ సచిన్ మీడియాతో మాట్లాడుతూ… మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోరును నమోదు చేయలేకపోయిందని అన్నారు. దీంతో టీమిండియాకు ఆ మ్యాచ్ క్లిష్టతరంగా మారిందని చెప్పారు. తీవ్ర నిరాశ మిగిలేలా ఓడిపోయామని అన్నారు. అయితే, టీమిండియా మొత్తానికి టీ20ల్లో బాగానే రాణిస్తోందని, ఆ ఫార్మాట్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని సచిన్ గుర్తు చేశారు.

నంబర్ 1 స్థానానికి చేరుకోవడం రాత్రికి రాత్రే సాధ్యమయ్యే పని కాదని సచిన్ టెండూల్కర్ చెప్పారు. కేవలం సెమీఫైనల్ లో టీమిండియా ఇచ్చిన ప్రదర్శనను చూసి ఆ జట్టు ఆటతీరును నిర్ణయించకూడదని అన్నారు. క్రీడల్లో ఎత్తుపల్లాలు ఉండడం సహజమేనని అన్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..