Tanzanian Siblings : బాలీవుడ్ హిట్ సాంగ్స్‌ను లిప్ సింక్‌తో ఊపేశారు.. ఎవరీ టాంజానియా అన్నాచెల్లెళ్లు..!
బాలీవుడ్ హిట్ సాంగ్స్‌ను ఓ ఊపు ఊపేస్తున్నారు ఈ టాంజానియా అన్నాచెల్లెళ్లు.. లిప్ సింక్స్‌తో బాలీవుడ్ సాంగ్స్ రీక్రియేట్ చేస్తున్నారు. వీరి వీడియోలే తెగ ట్రెండ్ అవుతున్నాయి.

Who Are Tanzanian Siblings Kili And Neema Paul, Going Viral For Their Bollywood Lip Sync Videos
Tanzanian Siblings : బాలీవుడ్ హిట్ సాంగ్స్‌ను ఓ ఊపు ఊపేస్తున్నారు ఈ టాంజానియా అన్నాచెల్లెళ్లు.. తమ లిప్ సింక్స్‌తో బాలీవుడ్ సాంగ్స్ రీక్రియేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వీరి లిప్ సింక్ వీడియోలే తెగ ట్రెండ్ అవుతున్నాయి. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, బ్యూటీ కియారా అద్వానీ నటించిన మూవీ ‘షేర్షా’. కార్గిల్ పోరాట యోధుడు విక్రమ్ బాత్రా జీవిత కథ ఆధారంగా విష్ణు వర్ధన్ ఈ మూవీని తెరకెక్కించారు. ఆగస్టు 12 న అమెజాన్ ప్రైమ్ వేదికగా రిలీజ్ అయింది. ఈ మూవీలోని ‘రాతన్ లంబియాన్ పాటకు టాంజానియా చెందిన టిక్ టాక్ సెన్సేషన్ కిలీపాల్, అతడి సోదరి నీమా రీక్రియేట్ చేశారు.
సాంగ్ లోని లిరిక్స్ తగట్టుగా ఇద్దరూ లిప్ సింక్ చేస్తూ తమ హావాభావాలతో అదరగొట్టేశారు. ఈ పాటను పాడిన ఒరిజినల్ సింగర్ జుబిన్ నౌటియాల్ కూడా ఫిదా అయిపోయారు. నెటిజన్లు కూడా వీరిద్దరి రీక్రియేషన్ లిప్ సింక్ సాంగ్స్ చూసి కిలీపాల్, నీమాలను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. టిక్ టాక్ సెన్సేషన్ కిలీపాల్ కు ఆఫ్రికా ఖండంలో ఫుల్ క్రేజ్ ఉంది. అతడి టిక్ టాక్ వీడియోలకు లక్షల్లో లైకులు వచ్చి పడతాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో టాంజానియాకు చెందిన అన్నాచెల్లెళ్ల వీడియోలు ట్రెండింగ్‌లో ఉన్నాయి.
కిలీపాల్.. నీమా పాల్ ఎవరంటే?
కిలీపాల్, నీమా టాంజానియాకు చెందిన అన్నాచెల్లెళ్లు. గ్రూవీ కొరియోగ్రఫీతో వీరిద్దరూ ఆన్-పాయింట్ లిప్-సింక్ వీడియోలు చేస్తూ నెటిజన్లను మెప్పించారు. ప్రస్తుతం కిలీ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 180k ఫాలోవర్లు ఉన్నారు. తనకు 100k ఫాలోవర్లకు చేరితే.. తన సోదరి నీమా కోసం కూడా ఇన్ స్టా అకౌంట్ క్రియేట్ చేస్తానని Instagram ఫాలోవర్లకు చెప్పాడు.
అన్నట్టుగానే చేశాడు. ప్రస్తుతం సోదరి నీమాకు కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో 2,500 మంది ఫాలోవర్లు ఉన్నారు. పాటలోని పదాలు కఠినమైనప్పటికీ టాంజానియా అన్నాచెల్లెళ్లు ఎక్కడా తడబడకుండా సరిగ్గా లిప్-సింక్ చేశారు. నెట్టింట్లో ఫేమస్ అయిన కిలీ, నీమాలకు రాబోయే బాలీవుడ్ మూవీల్లో నటించేందుకు ఆఫర్లు కూడా వస్తున్నాయట. ఏదిఏమైనా వీరిద్దరి వీడియోలను నెటిజన్లు కూడా రీక్రియేషన్, స్ఫూప్‌లు చేస్తూ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.
Read Also : SC serious : పెద్దలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు..మరి పిల్లలెందుకు స్కూలుకు వెళ్లాలి? సుప్రీంకోర్టు