Supreme Court : పెద్దలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు..మరి పిల్లలెందుకు స్కూలుకు వెళ్లాలి? సుప్రీంకోర్టు

ప్రభుత్వం తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చింది. మరి పిల్లలెందుకు స్కూళ్లకు వెళ్లాలి? అని సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

Supreme Court : పెద్దలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు..మరి పిల్లలెందుకు స్కూలుకు వెళ్లాలి? సుప్రీంకోర్టు

Delhi Pollution.. The Supreme Court Is Serious (1)


Delhi Pollution.. The Supreme Court is serious : దేశ రాజధానిలో వాయు కాయులష్యం తీవ్రస్థాయిలో పెరుగిన పరిస్థితుల్లో స్కూల్స్ మరోసారి మూసి వేయించింది ప్రభుత్వం. ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం కోర్టు ఫైర్ కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలపై మండిపడింది. కాలుష్యం తగ్గించే చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారు? కాలుష్య నివారణకు ఏం చేస్తున్నారనే విషయంపై రెండు రోజుల్లో చెప్పాలంటూ డెడ్ లైన్ పెట్టింది. అంతేకాదు.. ‘‘పెద్దలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు..మరి పిల్లలెందుకు స్కూలుకు వెళ్లాలి? అంటూ ప్రశ్నించింది సుప్రీంకోర్టు.

Read more : Covid : ఒకే కాలేజీలో 56మంది విద్యార్థులకు కరోనా.. ప్రిన్సిపాల్‌పై కేసు

సుప్రీం కోర్టులో గురువారం (డిసెంబర్ 2,2021) ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై మరోసారి విచారణ చేపట్టిన సందర్భంగా..ఢిల్లీ ప్రభుత్వం తరపున వాదిస్తున్న న్యాయవాది కాలుష్య వల్ల పిల్లలకు హాని కలుగుతుందని స్కూళ్లకు సెలవులు ఇచ్చామని..ఆన్ లైన్ క్లాసుల ద్వారా చదువులు కొనసాగుతున్నాయని కోర్టుకు తెలిపారు. దీనిపై న్యాయస్థానం మండిపడింది. ‘‘కాలుష్య సమస్య వల్ల ప్రభుత్వం తన ఉద్యోగులందరికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు..మరి పిల్లలెందుకు స్కూలుకు వెళ్లాలి? అంటూ ప్రశ్నించింది సుప్రీంకోర్టు.ఇటువంటి కారణాలు చెప్పి తప్పించుకోవద్దని మీ మాటల్ని కోర్టు సీరియస్ గా తీసుకుంటుందని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తీవ్రంగా మందలించారు.

కాగా ఢిల్లీలో అంతకంతకు పెరుగుతున్న కాలుష్యం వల్ల అన్ని విద్యాసంస్థలకు తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆన్‌లైన్‌లో మాత్రమే తరగతులు నిర్వహించవల్సిందిగా సూచించింది. ఐతే పరీక్షలు, ప్రాక్టికల్స్‌ నిర్వహణకు విద్యాసంస్థలను తెరవచ్చని కూడా పేర్కొంది.

Read more: Viral Video : ఫైల్స్ పట్టుకుపోయి..ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు చెమ‌ట‌లు పట్టించిన మేక..

కాగాబుధవారం ఢిల్లీ వాయు నాణ్యత మరింత క్షీణించింది. గురువారం నాటికి పరిస్థితి ఇంకా అద్వాన్నంగా మారింది. సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు నివేదికల ప్రకారం.. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌లో బుధవారం ఢిల్లీ వాయునాణ్యత 370గా నమోదుకాగా, గురువారం ఉదయం 7 గంటల సమయంలో 416గా చూపించింది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం ఆఫ్‌లైన్‌ క్లాసులన్నింటినీ రద్దు చేసింది.