Pakistan Prime Minister: అవసరమైతే నా బట్టలు అమ్మేస్తా.. పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు..
పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం ముదురుతోంది. పెట్రోల్ ధరల నుంచి నిత్యావసర వస్తువుల ధరలుసైతం భారీగా పెరుగుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు స్థానిక ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. పాక్ ప్రజలు ఎక్కువగా వినియోగించే గోదుమల ధరలు భారీగా పెరిగాయి. ఈ విషయంపై పాక్ ప్రధాని షెహబాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Pakistan
Pakistan Prime Minister: పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం ముదురుతోంది. పెట్రోల్ ధరల నుంచి నిత్యావసర వస్తువుల ధరలుసైతం భారీగా పెరుగుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు స్థానిక ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. పాక్ ప్రజలు ఎక్కువగా వినియోగించే గోదుమల ధరలు భారీగా పెరిగాయి. ఈ విషయంపై పాక్ ప్రధాని షెహబాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. థకారా స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని షెహబాజ్ మాట్లాడారు.. వచ్చే 24గంటల్లో 10 కిలోల గోదుమ పిండి బస్తాధరను తగ్గించకుంటే నా బట్టలను అమ్మేస్తానని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఖైబర్ ఫక్తున్ఖ్వా ముఖ్యమంత్రి మహమూద్ ఖాన్ కి తన నిర్ణయాన్ని తెలిపారు. నా బట్టలు విక్రయించి అయిన ప్రజలకు తక్కువ ధరలో గోధుమ పిండి అందిస్తానంటూ పాక్ ప్రధాని పేర్కొనడం స్థానికంగా సంచలనంగా మారింది.
Pakistan PM: తనను తాను ‘మజ్నూ’గా అభివర్ణించుకున్న పాక్ ప్రధాని
పనిలోపనిగా పాక్ మాజీ ప్రధానిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ దేశానికి నిరుద్యోగాన్ని, ద్రవ్వోల్భణాన్ని కానుకగా ఇచ్చారంటూ షెహబాజ్ మండిపడ్డారు. ఇమ్రాన్ ఖాన్ ఐదు మిలియన్ ఇళ్లు, 10 మిలియన్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాడని, కానీ వాటిని అమలు చేయడంలో విఫలమయ్యాడని, అదే సమయంలో దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ ను అన్నిరంగాల్లో అభివృద్ధి పర్చేందుకు నేను అన్నివిధాల కృషిచేస్తున్నాని, అవసరమైతే నా ప్రాణాలనుసైతం ఫణంగా పెడతానంటూ అన్నారు.
Pakistan: వామ్మో.. పాకిస్థాన్‌లో పెట్రోల్ ధర ఎంతో తెలుసా.. ఇండియాతో పోల్చితే..
బహిరంగంగా అందరినీ కించపరిచే ఇమ్రాన్ ఖాన్.. అవిశ్వాస తీర్మానం ద్వారా తనను అధికారం నుంచి తప్పించేస్తారని గ్రహించి ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరుగుతున్న సమయంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలను తగ్గించారని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన ధరలు తగ్గించలేమని, కొద్దిరోజుల్లో ఇంధన ధరలు అదుపులోకి తెచ్చేలా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన తండ్రి, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ప్రశంసించారు. నవాజ్ షరీఫ్‌కు ప్రజలు, ఈ దేశం పట్ల ఎంతో ప్రేమ ఉందని, నేను ఆయన మార్గంలో పయణిస్తున్నట్లు తెలిపారు.