Guinness World Record : మీలో ఉన్న టాలెంట్ ఒకసారి చెక్ చేసుకోండి .. కెల్సీ ఇలాగే ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది.. ఇంతకీ ఏం చేసింది…
ప్రపంచ రికార్డు సాధించాలంటే ముందు రికార్డుల జాబితా చూడాలేమో? కెల్సీ అనే లేడీ అలానే చేసింది. తనకున్న టాలెంట్‌తో రికార్డు బద్దలు కొట్టవచ్చని డిసైడైంది. గిన్నిస్ రికార్డు సాధించింది. ఇంతకీ ఆమెలో ఉన్న టాలెంట్ ఏంటి?

Guinness World Record
Guinness World Record : పాదాల్ని వెనక్కి తిప్పాలి అంటే మనం వెనక్కి తిరగాలి. కానీ ఓ లేడీ తాను ఒకే పొజిషన్‌లో ఉండి పాదాలను ముందుకి, వెనుకకి తిప్పగలదు. అలా చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో పేరు నమోదు చేసుకుంది.
Guinness Record : 4 ఏళ్లకే గిన్నిస్ రికార్డ్.. ఆ బుడతడు చేసిన పనికి ఆశ్చర్యపోతారు..
కొన్ని రికార్డులు.. కొందరి ప్రతిభ చూసిన తరువాత అరే.. మనలో కూడా ఈ టాలెంట్ ఉంది కదా.. దీనికి ఇంత గుర్తింపు ఉందా? అని కొందరు తీరిగ్గా ఆలోచిస్తారు. న్యూ మెక్సికో అల్బుకెర్కీకి చెందిన కెల్సీ గ్రబ్ కూడా అలానే అనుకున్నా ఆలస్యం చేయలేదు. ప్రపంచ రికార్డ్ బద్దలు కొట్టింది.
కెల్సీ ఓ లైబ్రరీలో పని చేస్తోంది. ప్రపంచ రికార్డు పుస్తకం కొత్త ఎడిషన్ అక్కడ ఆమెకు కనిపించింది. పేజీలు తిప్పుతుంటే పాదాలు రొటేషన్ ఉన్న పేజీని చూసి ఆశ్చర్యపోయింది. నేను కూడా ఇలా చేయగలను కదా.. అనుకుంది. వెంటనే కెల్సీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వారిని కాంటాక్ట్ చేసింది. తన పాదాలను 171.4 డిగ్రీలు తిప్పి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో స్ధానం సంపాదించింది.
కెల్సీ ఈ రికార్డ్ కోసం తన పాదాలకు హాని కలిగించే ఏ ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఆమె సహజంగానే పాదాలను తిప్పగలదు. ఇది నిజంగానే ఆమెలో ఉన్న ప్రత్యేకమైన టాలెంట్. ఐస్ స్కేటింగ్ కెరియర్‌లో కూడా ఈ టాలెంట్ కెల్సీకి ఎంతగానో ఉపయోగపడిందట. పాదాలు రొటేట్ చేస్తున్నప్పుడు కెల్సీకి కాలు గుండ్రంగా తిరిగినట్లు అనుభూతి కలుగుతుందట.. అలాగే కాళ్లు కదలకుండానే వెనక్కి తిరిగి చూడటం వల్ల తన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించగలదట. ఏది ఏమైనా ఎవరికీ సాధ్యం కాని పనులు చేయగలిగితేనే కదా ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టేది. నిజంగా కెల్సీ గ్రేట్ లేడీ.