Guinness Record : 4 ఏళ్లకే గిన్నిస్ రికార్డ్.. ఆ బుడతడు చేసిన పనికి ఆశ్చర్యపోతారు..

వయసు నాలుగేళ్లే.. కానీ స్నేహం, దయాగుణం అనే కాన్సెప్ట్ ల మీద పుస్తకం రాసేంత మేధాశక్తి. అతని అద్భుతమైన తెలివితేటలకి గిన్నిస్ బుక్ అబ్బురపడిపోయింది. నాలుగేళ్లకే పుస్తకం రాసేసిన చిన్నారికి తమ రికార్డ్స్ లో స్ధానం కల్పించింది.

Guinness Record : 4 ఏళ్లకే గిన్నిస్ రికార్డ్.. ఆ బుడతడు చేసిన పనికి ఆశ్చర్యపోతారు..

Gunnisess Record

Gunnisess Record : ఇంకా అక్షరాలు పూర్తిగా పలకడం రాని వయసు. పలక మీద ఇంకా రాతలు నేర్చుకునే వయసు. అంత చిన్న వయసులోనే ఆ చిన్నారికి భగవంతుడు అపూర్వమైన శక్తి ఇచ్చాడో? ఏమో? నాలుగేళ్ల వయసులోనే ఓ పుస్తకం రాసేసాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో(guinness world record) స్ధానం సంపాదించాడు. ఈ విషయాన్ని గిన్నిస్ బుక్ యాజమాన్యం తమ బ్లాగ్ లో పొందుపరచడంతో ఈ చిన్నారి టాలెంట్ చూసి ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Guinness World Record : భారతీయుల ఘనత..73 గంటల్లో 7 ఖండాల్లో ప్రయాణించి గిన్నిస్ రికార్డ్

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్ధానం సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. అరుదైన వ్యక్తులు.. వారి టాలెంట్, వారు చేసే అద్భుతాల్ని గుర్తించి తమ రికార్డ్స్ లో నమోదు చేస్తారు. కొన్ని రికార్డ్స్ చూస్తే మనం నోరెళ్లబెడతాం. అయితే తాజాగా నాలుగేళ్ల చిన్నారి “”సయీద్ రషీద్ మహీరీ” (Saeed Rashed AlMheiri) సాధించిన ఘనతను గిన్నిస్ యాజమాన్యం తమ బ్లాగ్ లో పొందుపరిచింది.

Josephine Michaluk : 96 లీటర్లు రక్తాన్ని దానం చేసిన 80 ఏళ్ల బామ్మ .. మానవత్వాన్ని వరించిన గిన్నిస్‌ రికార్డు

UAE కి చెందిన సయీద్ “ది ఎలిఫెంట్ సయీద్ అండ్ ది బేర్” (The Elephant Saeed and the Bear) అనే పుస్తకం రాశాడు. అనుకోకుండా రెండు జంతువుల మధ్య కుదిరిన స్నేహం (friendship).. దయాగుణంతో (kindness) ఎలా మెలగాలో తెలిపే అంశాలతో సయీద్ ఈ పుస్తకాన్ని రాశాడు. దాంతో ప్రపంచంలోనే ఈ అరుదైన ఘనత సాధించిన అతి పిన్నవయస్కుడిగా రికార్డు సాధించాడు. ఇంతకీ ఈ పుస్తకం రాయడానికి సయీద్ కి ఇన్స్పిరేషన్ (Inspiration) ఎవరో తెలుసా? సొంత అక్క. ఆమె కూడా తన 8వ ఏటనే రెండు పుస్తకాలు రాసి రికార్డులు బద్దలు కొట్టింది. వీళ్ల టాలెంట్ చూస్తుంటే భవిష్యత్ లో ఇంకా ఎన్నో అవార్డులు సాధించడం ఖాయం అనిపిస్తోంది.