Guinness World Record : భారతీయుల ఘనత..73 గంటల్లో 7 ఖండాల్లో ప్రయాణించి గిన్నిస్ రికార్డ్

భారతదేశానికి చెందిన సుజోయ్‌కుమార్‌ మిశ్రా,డాక్టర్ అలీ ఇరానీ అనే ఇద్దరు వ్యక్తులు కేవలం మూడు రోజుల్లో అంటే 73 గంటల్లో ఏకంగా ఏడు ఖండాలను చుట్టి ప్రపంచ రికార్డు సృష్టించారు.

Guinness World Record : భారతీయుల ఘనత..73 గంటల్లో 7 ఖండాల్లో ప్రయాణించి గిన్నిస్ రికార్డ్

Two Indians Guinness world record

Guinness world record : భారతదేశానికి చెందిన సుజోయ్‌కుమార్‌ మిశ్రా,డాక్టర్ అలీ ఇరానీ అనే ఇద్దరు వ్యక్తులు కేవలం మూడు రోజుల్లో అంటే 73 గంటల్లో ఏకంగా ఏడు ఖండాలను చుట్టి ప్రపంచ రికార్డు సృష్టించారు. మూడు రోజుల్లో ఏకంగా ఏడు ఖండాలు ప్రయాణించారా? అనే ఆశ్చర్యం ఖచ్చితంగా కలుగుతుంది. అదే మరి గిన్నీస్ రికార్డులు ఊరికే వస్తాయా ఏంటీ? అందుకే అంటార్కిటికాలో మొదలు పెట్టిన ఈ ఇద్దరు ఆస్ట్రేలియాలో ముగించారు కేవలం మూడు రోజుల ఒక గంట సమయంలో. వీరి ప్రతిభను గుర్తించారు గిన్నిస్ వరల్డ్ బుక్ ప్రతినిథులు.

మొత్తం 3 రోజుల 1 గంట 5 నిమిషాల 4 సెకండ్లలో ఏడు ఖండాలను చుట్టేసినట్టు గిన్నిస్‌ రికార్డు తన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసి వీరి ఘనతను దృవీకరించింది. సుజోయ్, అలీలు డిసెంబర్‌ 4న (2022)అంటార్కిటికాలో విమానంలో వీరి యాత్ర ప్రారంభించారు. అలా డిసెంబర్ 7 ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ప్రయాణాన్ని ముగించారు.

యూఏఈకి చెందిన ఖవ్లా అల్‌ రొమైతి సృష్టించిన మూడు రోజుల 14 గంటల 46 నిమిషాల 48 సెకండ్ల రికార్డును వీరిద్దరు బ్రేక్ చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. ఏడు ఖండాల్లోని ఆసియా, ఆఫ్రికా, యూరప్‌, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఆస్ట్రేలియాలో పర్యటించారు.