Zion Clark: చేతులతో వేగంగా పరుగెత్తి గిన్నిస్ రికార్డు బద్దలు కొట్టిన వికలాంగుడు.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..

అమెరికా వికలాంగ అథ్లెట్ జియాన్ క్లార్క్ కేవలం చేతులతో 4.78 సెకండ్లలో 20 మీటర్ల దూరాన్ని పరుగెత్తి గిన్నీస్ వరల్డ్ రికార్డుకెక్కాడు. అయితే.. అతని ఘనతకు సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్స్ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్లార్క్ ప్రతిభను చూసి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Zion Clark: చేతులతో వేగంగా పరుగెత్తి గిన్నిస్ రికార్డు బద్దలు కొట్టిన వికలాంగుడు.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..

Zion Clark

Zion Clark: అంగవైకల్యం ఉన్నా పట్టుదలతో సాధనచేసి గిన్నీస్ రికార్డులు బద్దలు కొడుతున్న వికలాంగులు ఎందరో ఉన్నారు. ఫలితంగా అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు. ఇలాంటి వారిలో జియాన్ క్లార్క్ ఒకరు. అంగవైకల్యంతో పుట్టినప్పటికీ ఎప్పుడూ తన వైకల్యాన్ని చూసి జియాన్ కుంగిపోలేదు. నిత్యం సాధనచేస్తూ చేతులతో అత్యంత వేగంగా పరుగెత్తి గిన్నీస్ రికార్డును బద్దలు కొట్టాడు. తాజాగా జియాన్ క్లార్క్ ప్రతిభకు సంబంధించిన వీడియోను గిన్నీస్ వరల్డ్ రికార్స్ వాళ్లు తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

viral video : ఏయ్ బుజ్జీ..డాడీ వచ్చేస్తున్నారు,టీవీ కట్టేసి చదువుకో : పాపకు వార్నింగ్ ఇచ్చిన కుక్క

అమెరికాలోని ఒహియో స్టేట్‌లోని కోలంబస్ ప్రాంతంకు చెందిన క్లార్క్ పుట్టుకతోనే వైకల్యుడు. కయుడాల్ రిగ్రెసిన్ సిండ్రోమ్ అనే పరిస్థితి కారణంగా అతనికి నడుము కింది భాగం ఉండదు. పుట్టిన వెంటనే అతన్ని తల్లిదండ్రులు వదిలేశారు. దీంతో క్లార్క్ ఒహియో పట్టణంలోనే ఓ ఆశ్రమంలో పెరిగాడు. కొంతకాలానికి అతన్ని అమెరికన్ స్టాక్ మార్కెట్ నిపుణురాలు కింబర్లీ హాకిన్స్ దత్తత తీసుకున్నారు. హాకిన్స్ ఆమె పిల్లలతో సమానంగా క్లార్క్‌ను పెంచారు. చిన్నతనం నుంచే చేతులతో వేగంగా పరుగెత్తడంపై దృష్టి సారించిన క్లార్క్ .. హాకిన్స్ సహాయంతో అద్భుతాలు సృష్టించే స్థాయికి ఎదిగాడు.  పాఠశాలలో మిగిలిన విద్యార్థులతో పోటీ పడుతూ మంచి గ్రేడ్‌ మార్కులతో  ఉత్తీర్ణత  సాధిస్తూ వచ్చిన క్లార్క్.. ప్రాథమిక పాఠశాలలో కుస్తీని నేర్చుకొని ఉన్నత పాఠశాలలో అద్భుతమైన రెజ్లర్ గా మారాడు.

 

2021లో అత్యంత వేగంగా చేతులతో పరుగెత్తిన వ్యక్తిగా క్లార్క్ రికార్డు సృష్టించాడు. 4.78 సెకండ్లలో 20 మీటర్ల దూరాన్ని చేతులతో పరుగెత్తి గిన్నీస్ వరల్డ్ రికార్డుకెక్కాడు. అయితే.. అతని ఘనతను గిన్నిస్ వరల్డ్ రికార్డు వాళ్లు తాజాగా వీడియో రూపంలో తమ ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు జియాన్ క్లార్క్ ప్రతిభ పట్ల ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే.. క్లార్క్ జీవితంపై డాక్యుమెంటరీని కూడా తీశారు. అది సుడాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపిక కావడంతో పాటు నెట్ ఫ్లిక్స్‌లోనూ స్ట్రీమ్ అయింది. అయితే, 2024లో రెజ్లింగ్‌లో ఒలింపిక్, పారాలింపిక్‌లో వీల్ చైర్ రేసింగ్ గేమ్‌లలో పోటీపడే మొదటి అమెరికన్ అథ్లెట్‌గా కార్క్ రికార్డు సృష్టించాలని కోరుకుంటున్నాడు.