డేటింగ్ కోసం ఎంతో ఆత్రుతగా అమ్మాయి దగ్గరికి వెళ్లిన అబ్బాయి.. అక్కడ దృశ్యం చూసి షాక్

ఒక అమ్మాయి.. మిమ్మల్ని డేటింగ్ కి పిలిచింది. మీరు అందంగా రెడీ అయ్యారు. ఆ తర్వాత ఎంతో ఆత్రుతగా అమ్మాయి దగ్గరికి వెళ్లారు. కట్ చేస్తే.. మీలాగే మరికొందరు అబ్బాయిలు అప్పటికే డేటింగ్ కోసం అమ్మాయి దగ్గర కనిపించారనుకోండి.. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఊహించుకుంటూ ఉంటూనే పిచ్చెక్కిపోతోంది కదూ. జస్ట్ ఇమేజిన్ చేసుకుంటేనే మీ పరిస్థితి ఇలా ఉంటే, నిజంగా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్న ఆ అబ్బాయి దుస్థితి ఇంకెలా ఉంటుందో కదూ.

డేటింగ్ కోసం ఎంతో ఆత్రుతగా అమ్మాయి దగ్గరికి వెళ్లిన అబ్బాయి.. అక్కడ దృశ్యం చూసి షాక్

16 Guys On A Date

Updated On : April 22, 2021 / 5:59 PM IST

16 Guys On A Date : ఒక అమ్మాయి.. మిమ్మల్ని డేటింగ్ కి పిలిచింది. మీరు అందంగా రెడీ అయ్యారు. ఆ తర్వాత ఎంతో ఆత్రుతగా అమ్మాయి దగ్గరికి వెళ్లారు. కట్ చేస్తే.. మీలాగే మరికొందరు అబ్బాయిలు అప్పటికే డేటింగ్ కోసం అమ్మాయి దగ్గర కనిపించారనుకోండి.. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఊహించుకుంటూ ఉంటూనే పిచ్చెక్కిపోతోంది కదూ. జస్ట్ ఇమేజిన్ చేసుకుంటేనే మీ పరిస్థితి ఇలా ఉంటే, నిజంగా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్న ఆ అబ్బాయి దుస్థితి ఇంకెలా ఉంటుందో కదూ.

అవును, ఒక అబ్బాయికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. డేటింగ్ కు అమ్మాయి దగ్గరికి వెళ్లగా.. అదే సమయానికి 16మంది అబ్బాయిలు అక్కడ ఉన్నారు. ఆ అమ్మాయి వారిని కూడా డేటింగ్ కు పిలిచింది. అంతే, ఆ అబ్బాయి ఆనందం ఆవిరైంది. మైండ్ బ్లాంక్ అయ్యింది. అమ్మాయి తీరుతో అతడు విస్తుపోయాడు. ఈ విషయాన్ని అతడు టిక్ టాక్ వీడియో(@peakay81) ద్వారా షేర్ చేశాడు.

డేటింగ్ యాప్ హింజ్ లో(Hinge) ఓ అమ్మాయి అతడికి పరిచయం అయ్యింది. డేటింగ్ కు రావాలని వెల్ కమ్ చెప్పింది. ఓ అడ్రస్ కూడా చెప్పింది. రెడీ అయిన అబ్బాయి ఎంతో ఆత్రుతగా ఆ అమ్మాయి చెప్పిన అడ్రస్ కి వెళ్లాడు. అక్కడికి వెళ్లగానే అతడికి అమ్మాయి కనిపించ లేదు. సరికదా నలుగురు అబ్బాయిలు తారసపడ్డారు. వారు కూడా డేటింగ్ కోసం వచ్చారని తెలుసుకుని ఆ అబ్బాయి కంగుతిన్నాడు.

”నాకు డేటింగ్ కు వెళ్లడం అంటే చాలా ఇష్టం. డేటింగ్ కు వెళ్లాలని ఎంతో ఆసక్తిగా ఉన్నా. కానీ జరిగింది చూసి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇది జోక్ కాదు” అని @peakay81 తన వీడియోలో చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత అతడు తన కెమెరాని ఇతర అబ్బాయిల మీదకు తిప్పాడు. వారిని ఒక్కొక్కరిగా పరిచయం చేశాడు. వారిలో తొలి వ్యక్తి ఆ అమ్మాయి ఫ్రెండ్. అమ్మాయి బలవంతం మీద అతడు అక్కడికి వచ్చాడు. ఆ తర్వాత డేటింగ్ కు రావాలని ఆహ్వానం అందుకున్న మిగతా ముగ్గురిని వీడియోలో చూపించాడు.

ఆ తర్వాత డేటింగ్ ఆర్గనైజ్ చేసిన అమ్మాయి వైపు కెమెరా తిప్పాడు. ”డేటింగ్ యాప్ లో నాతో మ్యాచ్ అయిన అందరిని నేను డేటింగ్ కి ఇన్వైట్ చేశారు. అందుకే మీరంతా ఇక్కడున్నారు” అని ఆ యువతి చెప్పింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్వల్ప వ్యవధిలోనే 21వేల లైక్స్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ‘ఆ అమ్మాయి తన సొంత ప్రేమ దేశం ఏర్పాటు చేసుకుంది” అని ఒక నెటిజన్ అన్నాడు. ” ఆ అబ్బాయి ప్లేస్ లో నేను కనుక ఉండి ఉంటే సింపుల్ గా అక్కడి నుంచి వాకవుట్ చేసేవాడిని” అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.