Most Frugal Lady : పిసినారి పెళ్లాంతో చుక్కలు చూస్తున్న భర్త .. మంచినీరు కూడా కొనదట!

ప్రపంచంలోనే అత్యంత పిసినారి మహిళగా రికార్డులకు ఎక్కింది అమెరికాకు చెందిన బికీ గుయిలీస్‌. ఈమె తాగునీరు కూడా కొనకుండా మంచి నుంచి మంచినీటిని తీసి కుటుంబ అవసరాలకు వాడుతుందట. ఇక భర్త తన కంటే ఎక్కువ తింటే దానికి డబ్బు ప్లే చెయ్యాలని షరతు కూడా పెట్టింది ఈ పిసినారి మహిళ.

Most Frugal Lady : పిసినారి పెళ్లాంతో చుక్కలు చూస్తున్న భర్త .. మంచినీరు కూడా కొనదట!

Most Frugal Lady

Updated On : August 8, 2021 / 3:41 PM IST

Most Frugal Lady : దేనికి డబ్బు ఖర్చు చేయకుండా.. పుణ్యానికి వస్తే తిందామని చూస్తుంటారు కొందరు.. ఇటువంటి వారినే మనం పిసినారి అంటుంటాం. డబ్బు ఆదా చేయడానికి ఖర్చులు తగ్గించుకుంటే తప్పులేదు కానీ తిండి తగ్గించుకొని డబ్బులు ఆదా చేస్తేనే ఇరుగుపొరుగువారికి కోపం వస్తుంటుంది. ఇటువంటి వారి నుంచి సామెతలు కూడా పుడుతుంటాయి.. పీనాసి వాడి పెళ్ళికి పచ్చడి మెతుకులు సంభావన అనేది ఓ సామెత. ఇక ఇటువంటి వారిని తరచూ మనం చూస్తూనే ఉంటాం.. కానీ మన ఇంట్లో వారే ఇలా చేస్తే చాలా ఇబ్బంది ఉంటుంది. ఏదైనా తినాలన్నా తినలేము, కొనాలన్నా కొనలేము..

అయితే ప్రపంచ పిసినారి సంఘానికే అధ్యక్షురాలైనట్లు ప్రవర్తిస్తుంది అమెరికా వాసినలభై ఒక్కేళ్ల బికీ గుయిలీస్‌. ‘అమెరికాలోనే అత్యంత పినాసి మహిళ’గా పేరు తెచ్చుకుంది. వాటర్‌ బిల్లు చెల్లించడం కూడా ఇష్టం లేని గుయిలీస్‌.. ఇంటి ముందు కురిసే మంచు సేకరించి దాన్ని నీరుగా మార్చి ఇంటి అవసరాలకు వాడుతుంది. ఈమె పీనాసితనానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఫ్రీ బై లేడీ’ పేరుతో తన పొదుపు సూత్రాలను పంచుకుంటున్న గుయిలీస్‌.. భర్త జాయ్‌కు తిండి పెట్టడానిక్కూడా డబ్బు తీసుకుంటుందట.

తిండి విషయంలో కూడా నేను చాలా పొదుపుగా ఉంటాను. తన భర్త తనకంటే ఎక్కువ ఆహారం తింటే అందుకు డబ్బు చెల్లించాలట.. ఆ డబ్బును ఇంటి అవసరాలకే ఖర్చు చేస్తుందట బికీ గుయిలీస్‌. ఆమె ఏదైనా వస్తువు కొనాలంటే అది 90 శాతం చావకదైనా అయ్యిండాలి లేదంటే ఫ్రీగా అయినా రావాలి. ఆలా అయితే ఏదైనా వస్తువును తన ఇంట్లోకి తీసుకొస్తుందట బికీ గుయిలీస్‌.

అయితే ఈమె ఇంత పిసినారిగా మారడానికి కారణం లేకపోలేదు. పెళ్ళికి ముందు, పెళ్లి తర్వాత కొన్నాళ్ళు ఉద్యోగం చేశారు బికీ గుయిలీస్‌. ఆ సమయంలో ఆమె ఏడాదికి 30 వేల డాలర్లు సంపాదించేవారట. అయితే ఆమెకు పిల్లలు పుట్టడంతో వారి ఆలన పాలన చూసుకునేందుకు ఇంటిదగ్గరే ఉండాల్సి వచ్చింది. దీంతో ఆమెకు ఆదాయం లేకుండా పోయింది. భర్త సంపాదన ఇంటిఖర్చులకు సరిపోయేది. దీంతో సేవింగ్స్ మొదలు పెట్టింది.

దేనిని వృధాగా పోనీయకుండా, అనవసర ఖర్చులు లేయకుండా కుటుంబాన్ని నడిపిస్తుంది బికీ గుయిలీస్‌. అయితే పిల్లలకు మాత్రం తిండి విషయంలో బికీ. వారికి ఎంత తిన్నా ఫైన్ లేదు. కానీ భర్త, తనకంటే ఎక్కువ తింటే డబ్బు వసూలు చేస్తుందట. అయితే ఈ కథ విన్నవారంతా పొదుపు మంచిదే కానీ పొట్ట కట్టుకుని మరీ ఇంతలా చేయాలా? అని విస్తుపోతున్నారు. భార్య పీనాసి తనాన్ని భరిస్తున్న జాయ్‌ మీద సానుభూతి చూపిస్తున్నారు.