ముంచెత్తిన వరదలు..నెత్తురు ముద్దలా మారిపోయిన గ్రామం

village drowned in red color water : ఇండోనేషియాలోని జెంగాట్‌లోని పెకలోంగన్ ప్రాంతం వరదలతో మునిగిపోయింది. దీంతో ఆ ప్రాంతమంతా నెత్తురు ముద్దలా మారిపోయింది. వరదలు రావటమేంటీ? గ్రామం అంతా ఎర్రగా మారిపోవటమేంటీ అనుకోవచ్చు. అసలు విషయం ఏమిటంటే..ఈ ప్రాంతంలోని స్థానికులు బట్టలకు రంగులు వేసే పరిశ్రమ ఉంది.
ఇక్కడ ఇండోనేషియా ప్రత్యేకత అయిన బాతిక్ విధానంలో దుస్తులకు రంగులు వేస్తారు. ఇది చాలా ఫేమస్. జెంగాట్‌లోని పెకలోంగన్ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తటంతో రంగులు వేసే పరిశ్రమ అంతా వరద నీటిలో మునిగిపోయింది.
దీంతో బట్లకు వాడే ఎరుపు రంగు ఆ నీటిలో కలిసి ఊరు ఊరంతా ఎర్ర రంగు నీటిలో మునిగినట్లు కనిపిస్తోంది. వర్షం నీటిలో రంగు కలిసిపోయిన తర్వాత కొంతసేపటికి ఈ రంగు కనిపించకుండా పోతుందని, ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని అధికారులు చెప్తున్నారు. వరదలతో ఓ గ్రామం మొత్తం ఎరుపెక్కిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గ్రామం అంతా నెత్తురు ముద్దలా కనిపిస్తోందని కొంతమంది అంటుంటే..లేదులేదు..గ్రామం ఎర్రటి రంగు అద్దుకున్న గులాబీలా కనిపిస్తోందరి మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా గ్రామం అంతా ఎర్రగా మారిపోవటం పెద్ద చర్చనీయాంశంగా మారింది.