Pineapple Enefits : రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఒక్క గ్లాసు పైనాపిల్ జ్యూస్ తాగండి చాలు!
పైనాపిల్ జ్యూస్ లో ఉండే మాంగనీసు ఎముకలు బలంగా మారేందుకు తోడ్పడుతుంది. అంతేకాకుండా గాయాలు తగిలిన సందర్భంలో అవి త్వరగా మానిపోయేలా చేయటంలో సహాయపడుతుంది. ప్రతిరోజు ఒక్క గ్లాసు పైనాపిల్ జ్యూస్ తీసుకోవటం ద్వారా రోజు మొత్తం ఉత్సాహంగా, ఉల్లాసంగా గడవచ్చు.

pineapple enefits
Pineapple Enefits : పైనాపిల్ లో మనిషి శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు ఉన్నాయి. దీని వల్ల ఆరోగ్యానికి చేకూరే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. విటమిన్ సీకి ఇది నిలయం. దీనిలో ఉండే యాంటీ ఆక్సీడెంట్లు, ఫైబర్ శరీరపనితీరును మెరుగుపరచటంలో సహాయకారిగా పనిచేస్తాయి. పైనాపిల్‌లో బీటీకెరోటిన్ కంటి చూపు లోపం తలెత్తకుండా కాపాడుతుంది. అధికబరువ తగ్గాలనుకునే వారికి దీనిలోని పీచు, తక్కువ కేలరీస్ బరువు తగ్గాలి అనుకునే వారికి బాగా ఉపకరిస్తాయి.
పుల్లగా తియ్యగా ఉండే పైనాపిల్‌లో పొటాషియం, సోడియం నిల్వలు అధికంగా ఉంటాయి. ఒత్తిడి, ఆందోళన తలెత్తినప్పుడు మనల్ని కాపాడతాయి. చిన్నపిల్లలకు తగినంత పాలు లభించనట్లయితే అలాంటి వారికి పైనాపిల్ రసాన్ని ఇవ్వటం మంచిదని వైద్యులు సైతం సూచిస్తున్నారు. అజీర్తి సమస్యతో బాధపడేవారికి ఈ జ్యూస్ దివ్య ఔషధంగా చెప్పవచ్చు. పైనాపిల్ రసాన్ని పచ్చకామెర్ల వ్యాధి, కాలేయ వ్యాధి ఉన్నవారు ప్రతిరోజు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
పైనాపిల్ జ్యూస్ లో ఉండే మాంగనీసు ఎముకలు బలంగా మారేందుకు తోడ్పడుతుంది. అంతేకాకుండా గాయాలు తగిలిన సందర్భంలో అవి త్వరగా మానిపోయేలా చేయటంలో సహాయపడుతుంది. ప్రతిరోజు ఒక్క గ్లాసు పైనాపిల్ జ్యూస్ తీసుకోవటం ద్వారా రోజు మొత్తం ఉత్సాహంగా, ఉల్లాసంగా గడవచ్చు. ఇదే విషయం అధ్యయనాల్లో సైతం నిరూపితమైంది. పైనాపిల్ తక్షణ శక్తిని ఇవ్వటంలో సహాయపడుతుంది. జుట్టు రాలడం తగ్గించడంలో సహాయపడుతుంది. మహిళలకు నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది.