Food : వయస్సుకు తగిన ఆహారం!

శరీరం ఆహారాన్ని జీర్ణం చేసుకోవటం కష్టంగా మారుతుంది. దీని వల్ల వేగంగా బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇది ఊబకాయానికి దారి తీస్తుంది.

Food : వయస్సుకు తగిన ఆహారం!

Age Appropriate Food

Updated On : March 20, 2022 / 4:48 PM IST

Food : జీవించటానికి ఆహారం అనేది చాలా ముఖ్యం. యవ్వనంలో ఉన్న సమయంలో వివిధ రకాల ఆహార పదార్దాలను తినేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఆకలి, జీర్ణ సామర్ధ్యాలు, ఇవన్నీ కూడా మనం తీసుకునే ఆహార పరిమాణాన్ని నిర్ధేశిస్థాయి. యవ్వనంలో తినాలనే కోరిక ఒక నిర్ధిష్ట వయస్సు దాటిన తరువాత ఆరోగ్య సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది. వయస్సు పై బడే కొద్దీ మన జీవక్రియలు మందగిస్తాయి. శరీరం ఆహారాన్ని జీర్ణం చేసుకోవటం కష్టంగా మారుతుంది. దీని వల్ల వేగంగా బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇది ఊబకాయానికి దారి తీస్తుంది. తద్వారా దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది. వయస్సుకు అనుగుణంగా ఆహారం తీసుకోవటం చాలా అవసరం…

20ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు ఆహారం తీసుకునే విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవు. ఇష్టం వచ్చిన వాటిని తినేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ వయస్సులో ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలి. తినే ఆహారాన్ని ఎక్కవ సార్లు తినటం మంచిది. తినే ఆహారంలో పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు, సాల్మన్, ట్యూనా, సోయా, వోట్మీల్ , పండ్లు , కూరగాయలు వంటి ఆహారాన్ని తీసుకోవాలి. బలమైన ఎముకలు, దంతాల కోసం విటమిన్ D అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఈ ఆహారాలన్నీ గుండె ఆరోగ్యానికి దోహదపడతాయి. ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ , మధుమేహం నివారణకు తోడ్పడతాయి. పండ్లు, తృణధాన్యాలు మొదలైన ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇవి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండటానికి తినాలన్న కోరికలను అదుపులో ఉంచటానికి సహాయపడతాయి.

30ఏళ్ళ వయస్సులో శరీరం క్రమంగా క్షీణించడం ప్రారంభమవుతుంది. రెగ్యులర్ డైట్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లను చేర్చుకోవడం ద్వారా మీ గుండె ఆరోగ్యాన్నికాపాడుకోవాలి. ఇందుకోసం సాల్మన్, మాకేరెల్, గుల్లలు, ట్యూనా, ట్రౌట్ పెర్చ్ గుండె కండరాలను బలపరిచే కొవ్వు ఆమ్లాలు ఉండే ఆహారాలు తీసుకోవాలి. దీనితో పాటు ఆల్కహాల్‌ తీసుకోవటం తగ్గించాలి. అతిగా తాగడం అనేది ఏమాత్రం మంచిదికాదు. దీని వల్ల శరీరానికి నష్టం కలుగుతుంది.

40ఏళ్ల వయస్సులో అనేక రకాల క్యాన్సర్‌లను నివారించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్‌లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అల్పాహారంగా ఓట్ మీల్‌తో పాటు జామ, మామిడి, డ్రాగన్ ఫ్రూట్ వంటి పండ్లు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. జీర్ణక్రియను సులభతరం చేయడానికి మీ ఆహారంలో సలాడ్‌లను తీసుకోవాలి. బరువు పెరుగుతామన్న భయంతో పిండి పదార్థాలను పూర్తిగా నిలిపివేయటం ఏమాత్రం మంచిది కాదు. ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. గంజి, గోధుమ రొట్టె, పాస్తా, బీన్స్, చిక్కుళ్ళు వంటి వాటిని ఆహారంలో చేర్చాలి.

50ఏళ్ల వయస్సలో ప్రవేశించగానే స్త్రీలలో అనేక రకాల సమస్యలు వస్తాయి. అధిక కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ లెవెల్స్, బ్లడ్ ప్రెజర్ వంటి సమస్యలు వెలుగుచూస్తాయి. ఈసమయంలో ముదురు ఆకుకూరలు, మొలకలు, బంగాళదుంపలు, బీన్స్ మరియు బీట్‌రూట్‌లు వంటి పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఈ ఆహారాలు సోడియం ప్రభావాన్ని తగ్గిస్తాయి. రక్తపోటు సమస్యలు అదుపులో ఉంచుతాయి. ఆహారంలో ఉప్పును తగ్గించడం స్థూలకాయాన్ని అరికట్టవచ్చు. ప్యాక్డ్ ఫుడ్స్ కు దూరంగా ఉండటం మంచిది.

60ఏళ్ల వయస్సులో ప్రవేశిస్తే మీరు జీవితంలో ఇప్పటివరకు చేసినవన్నీ సమీక్షించుకోవడానికి, భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకునే సమయంగా చెప్పవచ్చు. సమతుల్యమైన ఆహారం తీసుకోవటం చాలా అవసరం. కొవ్వును తగ్గించడానికి , కండరాలను నిలుపుకోవడం కోసం సహాయపడే వ్యాయామం అవసరమౌతుంది. ఎందుకంటే ఈవయస్సులో శరీరం కండరాలను కోల్పోవడం ప్రారంభమవుతుంది. తగినంత ప్రోటీన్ తీసుకోవడం తప్పనిసరి. వైద్యులను సంప్రదించి ఏం తీసుకోవాలి. ఏం తీసుకోకూడదన్న సమాచారాన్ని ఏప్పటికప్పుడు తెలుసుకోవటం అవసరం.