Health : తింటే చేదుగా ఉన్నా…ఆరోగ్యానికి మాత్రం మేలు చేస్తాయి…

బచ్చలికూరలో విటమిన్ సి, ఎ, ఇ, కె మరియు సి పుష్కలంగా ఉంటాయి. బచ్చలికూరలో ఉండే విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. దీంతో కంటి చూపు మెరుగు పడుతుంది.

Health : తింటే చేదుగా ఉన్నా…ఆరోగ్యానికి మాత్రం మేలు చేస్తాయి…

Food

Updated On : January 13, 2022 / 2:14 PM IST

Health : తింటే చేదుగా ఉండే ఆ పదార్థాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. అయితే చాలా మంది వాటిని తినేందుకు మాత్రం ఎక్కవగా ఇష్టపడరు. వీటిల్లో పోషకాలు అధికంగా ఉండటమే కాకుండా అనారోగ్యసమస్యలు దూరమౌతాయి. అలాంటి ఆహారాలను పురాతన కాలం నుండి చాలా మంది ఆహారంగా తీసుకుంటూ వస్తున్నారు. వీటివల్ల కలిగే ప్రయోజనాల గురించి వారికి తెలిసినంతగా ప్రస్తుతం ఉన్న జనరేషన్ కు తెలియదు. దీని వల్ల వాటిని తినేందుకు ఇష్టత చూపించటంలేదు. చేదుగా ఉండి ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని రకాల పదార్ధాల గురించి తెలుసుకుందాం…

గ్రీన్ టీ ; ఆరోగ్యానికి గ్రీన్ టీ వల్ల అనేక లాభాలున్నాయి. రుచికి చేదుగా ఉన్నప్పటికీ గ్రీన్ టీ తీసుకోవడం వల్ల బరువు తగ్గిపోతారు. రెగ్యులర్‌గా గ్రీన్ టీ తాగడం వలన మెదడు చురుగ్గా పని చేస్తుంది. జ్ఞాపకశక్తి కూడా బాగా పెరుగుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దుర్వాసన, దంతక్షయం, వివిధ రకాల చిగుళ్ళ వ్యాధులు కలిగించే బ్యాక్టీరియాని గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ తొలగిస్తాయి. గ్రీన్ టీ వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది.

కాకరకాయ ; కాకరకాయ చేదుగా ఉండే కూరగాయ. ఇది శరీరంలోని వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. విటమిన్ ఎ, సి, పోటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మధుమేహాన్ని నియంత్రిచండంలో కాకరకాయ ముందుంటుంది. కాలిన గాయాలను, పుండ్ల ను మాన్పడంలో కాకరకాయలోని గుణాలు అద్భుతంగా ఉపకరిస్తాయి. కాకరకాయ రసంలో నిమ్మకాయ రసం కలపి తాగితే శరీరంలోని కొవ్వు తగ్గుతుంది. కాకరకాయ రసాన్ని తరచూ పుక్కిలిస్తూ ఉంటే నోట్లో పుళ్ళు, నాలుక పూత తగ్గుతాయి. రక్తాన్ని శుధ్ధి పరిచి గుండె కు రక్త సరఫరా సక్రమంగా జరిగేలా చేయటం ఉపయోగపడుతుంది.

బచ్చలికూర ; బచ్చలికూరలో విటమిన్ సి, ఎ, ఇ, కె మరియు సి పుష్కలంగా ఉంటాయి. బచ్చలికూరలో ఉండే విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. దీంతో కంటి చూపు మెరుగు పడుతుంది. బచ్చలి ఆకు రసానికి చెంచాడు తేనె కలిపి ప్రతిరోజూ తీసుకుంటే రక్తహీనత సమస్య తగ్గుతుంది. గర్భిణీలు దీన్ని తింటే ఎన్నో పోషకాలు లభిస్తాయి. దీంతో బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. అలసటగా, నీరసంగా ఉన్నప్పుడు బచ్చలికూర తింటే తక్షణ శక్తి లభిస్తుంది. బచ్చలికూరలో ఉండే ఫ్లేవనాయిడ్స్ క్యాన్సర్‌తో పోరాడటానికి, రోగనిరోధక శక్తి పెంపొదిస్తాయి. పైల్స్ సమస్య ఉన్నవారు బచ్చలికూరను తింటుంటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.

మెంతులు ; మెంతుల్లో పోషకాలు, పీచు పదార్థాలు, ఇనుము, విటమిన్ సి, బి1, బి2, కాల్షియంలు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా ఖనిజాలు.. విటమిన్లు. ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. చేదుగా ఉన్నా మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రించడంలో మెంతులు బాగా పనిచేస్తాయి. మహిళల్లో పాల ఉత్పత్తి పెరగడానికి కూడా మెంతులు చాలా సహాయపడతాయి. మెంతులను తీసుకోవడం వలన మలబద్దకం సమస్య తగ్గుతుంది. మెంతులను నానబెట్టి ఆ నీటిని జుట్టుకి మసాజ్ చేస్తే జుట్టుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.