Apple : రోజుకొక ఆపిల్ ఆరోగ్యానికి మేలే!…

ప్రతిరోజు ఒక ఆపిల్ పండును తీసుకోవటం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలను అందించినవారం అవుతాము. తద్వారా మధుమేహం, మానసిక, గుండె సమస్యలను నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు. రోజుకో ఆపిల్‌

Apple : రోజుకొక ఆపిల్ ఆరోగ్యానికి మేలే!…

Apples

Updated On : September 30, 2021 / 11:54 AM IST

Apple : మనుషులు ఎక్కవగా తినేందుకు ఇష్టపడే పండ్లలో యాపిల్ పండు ఒకటి. ఇటీవలికాలంలో యాపిల్ పంటకు డిమాండ్ పెరగటంతో రైతులు ఆపిల్ సేధ్యాన్ని విసృతంగా చేపడుతున్నారు. పశ్చిమ ఆసియాలో జన్మించినప్పటికీ ఆతరువాత కాలంలో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కొన్ని వేల సంవత్సరాల నుండి ఆపిల్ పండ్లు పండిస్తున్నారు. ఆపిల్ లో ఎన్నో రకాల ఫోషకాలు ఉన్నాయి.

ప్రతిరోజు ఒక ఆపిల్ పండును తీసుకోవటం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలను అందించినవారం అవుతాము. తద్వారా మధుమేహం, మానసిక, గుండె సమస్యలను నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు. రోజుకో ఆపిల్‌ తింటే డాక్టర్ల దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పీచుపదార్థం, విటమిన్లు, ఖనిజలవణాలు ఆపిల్స్‌లో పుష్కలంగా ఉండడం వల్లే యాపిల్ కు అంత ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పవచ్చు.

గుండె సంబంధిత సమస్యల ముప్పుని తగ్గించుకోవాలంటే రోజూ కనీసం ఒక ఆపిల్‌ తినాలి. దీనిలోని పీచు పదార్థం కొలెస్ట్రాల్‌ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. అంతేగాక రక్తపీడనాన్ని అదుపులో ఉంచడానికి తోడ్పడి హృదయ సంబంధ సమస్యలు దరిచేరకుండా చూస్తుంది. రోజుకో గ్రీన్ యాపిల్ తినటం వల్ల కీళ్ళ నొప్పులు నుండి ఉపశమనం పొందవచ్చు.

మధుమేహం ఉన్నవారు సైతం ఆపిల్స్‌ను నిరభ్యంతరంగా తినవచ్చని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. మధుమేహం ఉన్నవాళ్లు ఆపిల్‌ తినడం వల్ల టైప్‌–2 డయాబెటీస్‌ ఏడు శాతం తగ్గుతుందని పలు పరిశోధనల్లో తేలింది. ఆపిల్ పండ్లలో ఉండే సి విటమిన్ న్యూమోనియా రాకుండా చూస్తుంది. గ్రీన్ యాపిల్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని రక్షిస్తాయి.

ఆపిల్‌ తినడం వల్ల మానసిక సమస్యలు దరిచేరవు. ఆపిల్‌లో ఉన్న క్వెర్సెటిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మానసిక సమస్యలు రానివ్వదు. అందుకే రోజూ ఆపిల్స్‌ తినేవాళ్లలో మతిమరుపు వచ్చే అవకాశాలు తక్కువ. జ్ఞాపక శక్తి సైతం బాగా పెరుగుతుందట. ఆపిల్ పండులో విటమిన్ ఎ, సి, బి, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, కార్భోహైడ్రేట్స్, పొటాషియం, క్యాలరీలు లభిస్తాయి.