Anjeer : ఆరోగ్యానికి అంజీరా…

అంజీరలో అధిక మోతాదులో కాల్షియం ఉంటుంది. దీన్ని పిల్లలకు ప్రతిదినం ఇస్తే ఎముకలు బలపడతాయి. దీనిలో ఎక్కువ మొత్తంలో ఉండే పీచు పదార్థం మలబద్ధకాన్ని నివారిస్తుంది.

Anjeer : ఆరోగ్యానికి అంజీరా…

Anjeer

Updated On : December 3, 2021 / 11:08 AM IST

Anjeer : అంజీరా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో దీనిని మేడిపండు, అత్తిపండు గా పిలుస్తారు. కొంచెం వగరు.. కొంచెం తీపి .. కాస్త వులువు ఉండే అంజీర్‌ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంజీరాలో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మూడు అంజీరాల నుండి కనీసం ఐదు గ్రాముల పీచు పదార్ధం అందుతుంది. ఒక రోజుకు అవసరమైన పీచులో 20శాతం అన్నమాట, అంజీర్‌తో విటమిన్-ఎ, బి1, బి2, కాల్షియం, ఐరన్, పాస్పరస్, మెగ్నీషియం, సోడియం, పొటాషియంతోపాటు క్లోరిన్ లభిస్తాయి. ఇంకా ఫ్లవనోయిడ్స్‌, పాలిఫినోల్స్‌ను కూడా వీటిల్లో ఉంటాయి.

అంజీర ఫలం లో కొవ్వు, పిండివదార్థాలు, సోడియం వంటి లవణాలు తక్కువగా ఉంటాయి. ఖనిజాలు, పీచు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. నోటి దుర్వాసన గలవారు భోంచేశాక ఒకటి రెండు పండ్లు తీసుకుంటే ఎంతో మంచిది. కడువులో వాయు ఆమ్లాలని తగ్గించి అన్నం అరగడానికి దోహదవడుతుంది. వీటి పైతొక్క గట్టిగా ఉటుంది. త్వరగా అరగదు కాబట్టి నీటిలో కాసేవు ఉంచి తొక్క తీసి తింటే మంచిది.

ఇవి రక్తహీనత నుంచి విముక్తి కలిగిస్తాయి. ఎండు పండ్లను ఎంతకాలమైనా నిలువ చేసుకోవచ్చు. దూరప్రయాణాల్లోనూ వాడుకోవచ్చు. ప్రత్యేకించి అంజీర పండులో పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్తోపాటు కావలసినంత పీచు పదార్థం కూడా ఉంటుంది. పలురకాల పోషకాలతోపాటు శరీరానికి ఎంతో మేలుచేసే ఫైటోకెమికల్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఎలర్జీ దగ్గు, కఫంతో ఇబ్బంది పడుతున్నవారు మేడివండు గొంతు ఇన్ఫెక్షన్‌, కఫాన్ని తగ్గిస్తుంది.

అంజీరలో అధిక మోతాదులో కాల్షియం ఉంటుంది. దీన్ని పిల్లలకు ప్రతిదినం ఇస్తే ఎముకలు బలపడతాయి. దీనిలో ఎక్కువ మొత్తంలో ఉండే పీచు పదార్థం మలబద్ధకాన్ని నివారిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తినటంవల్ల అధిక రక్తపోటుతో బాధపడేవారు ఎంతో లాభం పొందవచ్చు. ఇది అధిక రక్తపోటును అదుపులో వుంచటానికి సహకరిస్తుంది. అజీర పండులో పొటాషియం మరియు మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది హైపర్ టెన్షన్ ను కంట్రోల్ చేస్తుంది.

జర్నల్ ఆఫ్ ద అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్ లో ఎండు పండ్లలో అత్యధికంగా పోషకాలు ఉన్నది అంజీరలోనేనని స్పష్టం చేశారు. తాజా పండుగా చూసినా మిగతావాటితో పోలిస్తే అంజీరాలో ఎక్కువ పోషకాలు, ఎక్కువ కేలరీలు ఉన్నాయి. అయితే ప్రతి మూడు తాజా పండ్లల్లో 65 కేలరీలు ఉంటే, ప్రతి మూడు ఎండు పండ్లల్లో 215 కేలరీలు ఉన్నట్లు తేలింది.

అంజీర పండు తినడంవల్ల రొమ్ము కాన్సర్ రాకుండా కాపాడుతుంది. దీనివల్ల అధిక బరువు తగ్గుతుంది. అంజీరవల్ల మధుమేహం కూడా అదుపులో ఉంచుతుంది. దీనిలో ఉండే పొటాషియం పొలిఫెనల్స్, ప్లెవొనోయిడ్స్, యాంటి ఆక్సిడెంట్స్లు టైప్-2 మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి సహకరిస్తాయి. గ్యాస్టిక్స్ అల్సర్స్ రాకుండా కాపాడుతుంది. కిడ్నీ స్టోన్స్సు తగ్గించటానికి 4-5 అంజీర పండ్లను నానబెట్టి క్రమం తప్పకుండా తింటుంటే రాళ్లు కరుగుతాయి.

అంజీరను, ఓట్మీల్, సల్లాడ్, చట్నీలు, సల్సా, బియ్యం, పాస్తా కలిపి తీసుకుంటే మరింత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. నిద్రలేనివారు రాత్రి ఏడు గంటల తరువాత మూడు అంజీరపు పళ్ళు తిని, పాలు తాగితే చక్కగా నిద్రపడుతుంది. ఇందులోని ట్రైప్ట్ఫోన్స్ చక్కగా నిద్రపట్టడానికి సాయపడతాయి. తరచూ జలుబు చేసిందంటే ఈ అంజీరపు పళ్ళ రసం తాగితే బాగుంటుంది. ఆడపిల్లలు రోజు రెండు పళ్ళు తింటే మొటిమలు తగ్గి ఆకర్షణీయంగా తయారవుతారు.

తలలోని చుండ్రును నివారిస్తుంది. 3-4 అంజీరలను నానబెట్టి తలకు మర్దన చేయటంవల్ల తలలోని చుండ్రు పోతుంది. అత్తిపండ్లు దాంపత్య కార్యంలో పాల్గొనేవారికి నూతనోత్తేజాన్ని ఇస్తాయి. బలహీనతను పోగొట్టి శృంగారానికి సన్నద్ధం చేస్తాయి. నోటిలో పుండ్లు, పెదవుల పగుళ్లు, నాలుకు మంటవంటివి తొలగిపోతాయి.