Eating Samosas : సమోసాలు ప్రతిరోజు అదేపనిగా లాగించేస్తున్నారా? అయితే మీ గుండె ప్రమాదంలో పడ్డట్టే?
సమోసా నూనెలో అధిక కొవ్వు ఉంటుంది. అంతే కాకుండా మార్కెట్లో లభించే సమోసాలను మళ్లీ మళ్లీ వేడిచేసిన అలాంటి నూనెలో వేయిస్తుంటారు. ఈ రకమైన నూనెను తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది.
Eating Samosas
Eating Samosas : సమోసా రుచి ఆహారప్రియులను ఎక్కువగా ఆకర్షిస్తుంది. ఒక్కసారి దాని టేస్ట్ చూస్తే పదేపదే తినాలని మనస్సు లాగేస్తుంది. చాలా మంది రోజువారిగా సమోసాలు తినేస్తుంటారు. ఒకటి రెండు అయితే పర్వాలేదు కాని అధిక మోతాదులో వాటిని తింటే మాత్రం ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమోసాలు ఎక్కువగా తింటే మీ శరీరానికి చాలా హాని కలిగిస్తాయి. సమోసాలో వాడే నూనె ఆరోగ్యానికి హానికలిగిస్తుంది. అంతేకాకుండా వాటిని తయారీకి ఉపయోగించే పిండి కూడా అనేక సమస్యలకు కారణమౌతుంది.
నూనెతో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. సమోసా నూనెలో అధిక కొవ్వు ఉంటుంది. అంతే కాకుండా మార్కెట్లో లభించే సమోసాలను మళ్లీ మళ్లీ వేడిచేసిన అలాంటి నూనెలో వేయిస్తుంటారు. ఈ రకమైన నూనెను తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. దీని కారణంగా గుండెపోటు సమస్యలు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. సమోసాలు తీసుకోవటంలో శరీరంలో కేలరీలు పెరుగుతాయి. ఊబకాయం సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది.
సమోసా ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కొవ్వు బాగా పెరుగుతుంది. ఇందులో ఉండే ట్రాన్స్ ఫ్యాట్ గుండె జబ్బులు, ఊబకాయం వంటి అనేక సమస్యలకు కారణమౌతాయి. దీనిలోని బంగాళదుంప, మైదా, నూనె చర్మానికి ఆరోగ్యకరమైనవి కావు. ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మంపై ముడతలు, మొటిమలు ఏర్పడతాయి. త్వరగా వృద్ధాప్య ఛాయలు వస్తాయి. అధికంగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటుకు దారితీస్తే ప్రమాదం ఉంటుంది.
