Wet Hair : తడి జుట్టు విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా?

ముఖ్యంగా వేసవి కాలంలో జుట్టు తడిగా ఉన్న సమయంలోనే చాలా మంది పొనీటైల్ వేయటం, క్లిప్ లు తగిలించటం వంటివి చేస్తుంటారు. ఇలా చేయటం వల్ల జుట్టుకు హాని కలుగుతుంది.

Wet Hair : తడి జుట్టు విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా?

Wet Hair

Updated On : April 25, 2022 / 12:08 PM IST

Wet Hair : జుట్టు విషయంలో చాలా మంది ఎన్నో రకాల జాగ్రత్తలు పాటిస్తుంటారు. ముఖ్యంగా మహిళలైతే చెప్పాల్సిన పనిలేదు. జుట్టుకోసం వాడే షాంపోల నుండి, ప్రతి పదిహేను రోజుల కొకసారి హెయిర్ స్పా చేయిస్తూ మెరిసే ప్రకాశవంతమైన జుట్టును పొందటానికి ఎంతో కష్టపడుతుంటారు. అయితే చాలా సందర్భాల్లో తెలియకుండానే జుట్టు విషయంలో అనేక తప్పులు చేస్తుంటారు. వాటిలో తలస్నానం చేసిన తరువాత వెంటనే జుట్టును దువ్వటం, టవల్ తో తడిని పోగొట్టేందుకు ప్రయత్నించటం వంటివి చేస్తుంటారు. ఇలా చేయటం వల్ల జుట్టుకు తీవ్రమైన హాని కలుగుతుంది. హెయిర్ ఫోలికల్స్ తడిగా ఉన్న సందర్భంలో బలహీనంగా ఉంటాయి. దువ్వటం వల్ల జుట్టు ఊడిపోవటంతోపాటు నిస్తేజంగా మారిపోతుంది.

బ్యూటీ గురు,ప్రముఖ అరోమాథెరపిస్ట్, డా. బ్లోసమ్ కొచ్చర్ తడి జుట్టు విషయంలో రోజూ చేసే కొన్ని పొరపాట్లను తెలియజేస్తూ కొన్ని సూచనలు చేశారు. తడి జుట్టును దువ్వడం అనేది స్నానం చేసిన తరువాత చేసే మొదటి పని. జుట్టు చాలా బలహీనంగా ఉన్నవారికి సున్నితమైన సంరక్షణ చాలా అవసరం. స్నానం చేయబోయే ముందుగా జుట్టును దువ్వుకోవాలి. స్నానం అనంతరం జుట్టు చిక్కుపడినట్లు అనిపిస్తే హెయిర్ ఆయిల్ అప్లై చేసి తరువాత వెడల్పాటి పళ్లు కలిగిన దువ్వెనతో దువ్వుకోవటం మంచిది. ఇలా చేయటం వల్ల చిక్కుబడిపోయిన జుట్టు ఈజీగా వస్తుంది. అలాగే, జుట్టు పూర్తిగా ఆరిపోయే వరకు వేచి ఉండాలి. ఆతరువాతనే జుట్టును దువ్వుకోవాలి. జుట్టు చివరల నుండి దువ్వటం ప్రారంభించటం మంచిది. జుట్టును దువ్వే సందర్భంలో చేతిలో పట్టుకోవాలి.

వెంట్రుకల కుదుళ్లు తడిగా ఉన్నప్పుడు టవల్ తో దానిని కొడుతూ ఆరబెట్టే ప్రయత్నం చేయటం వల్ల వెంట్రుకలు బలహీనంగా మారతాయి. టవల్ తో కొట్టటం వల్ల కొన్ని సందర్భాల్లో జుట్టు ఊడిపోయే ప్రమాదం ఉంటుంది. జుట్టును టవల్‌తో తుడవటం మంచిది దీని వల్ల జుట్టులో ఉన్న తడిని తొలగించేందుకు అవకాశం ఉంటుంది. కొంతమంది జుట్టుకు టవల్ ని చుట్టుకుంటుంటారు. ఇలా చేయటం ఏమాత్రం సరైంది కాదని గుర్తుంచుకోవాలి. ఇలా చేయటం వల్ల చుండ్రు వచ్చే అవకాశాలు ఉంటాయి.

ముఖ్యంగా వేసవి కాలంలో జుట్టు తడిగా ఉన్న సమయంలోనే చాలా మంది పొనీటైల్ వేయటం, క్లిప్ లు తగిలించటం వంటివి చేస్తుంటారు. ఇలా చేయటం వల్ల జుట్టుకు హాని కలుగుతుంది. ఇలా చేయటం వల్ల జుట్టు దెబ్బతిండింది. జుట్టు పూర్తిగా ఆరిపోయిన తరువాత మాత్రమే నచ్చిన రీతిలో పొనీ టైల్ లేదా క్లిప్స్ పెట్టుకోవటం మంచిది. తడి వెంట్రుకలను ఆరబెట్టుకునేందుకు హీట్ టూల్స్ ఉపయోగించడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. జుట్టును త్వరగా ఆరబెట్టడానికి బ్లో డ్రైయర్‌ను వాడటం వల్ల జుట్టుకు హాని కలుగుతుంది. నీటి తడి ఆరిపోయేంత వరకు వేచి ఉండటం మంచిది. లేకుంటే డ్రైయర్‌ను మీడియం వేడి మీద ఉంచి జుట్టును ఆరబెట్టుకోవాలి. కొంతమంది జుట్టుకు ఆవిరి పెట్టటం వంటివి చేస్తుంటారు ఇలా చేయటం వల్ల జుట్టుకు నష్టం వాటిల్లుతుంది. తడి జుట్టుతోనే చాలా మంది నిద్రకు ఉపకరిస్తుంటారు. ఇలా చేయటం వల్ల జుట్టు తీవ్రంగా డ్యామేజ్ అవుతుంది. జుట్టు తడి కాస్తా చివరకు జలుబుకు దారితీస్తుంది. రోగనిరోధక వ్యవస్థకు ఆటంకం కలిగిస్తుంది, ఎందుకంటే తడి జుట్టుతో నిద్రించడం వల్ల బ్యాక్టీరియా
పెరుగుదలకు దారితీస్తుంది. మొటిమల వంటి సమస్యలు వస్తాయి.